అమరావతి మార్చ్ 22: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. పార్లమెంటుకు 13 మంది, రాష్ట్ర అసెంబ్లీకి 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్‌విూట్‌లో స్పందిస్తూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)లో చేరామన్నారు.పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా ప్రాతినిధ్యం వహించే, దాని కోసం పోరాడే అభ్యర్థులను పార్టీ బరిలోకి దింపుతోందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభకు 13 మంది టీడీపీ అభ్యర్థులు, మరో 11 మంది అసెంబ్లీ స్థానాలకు ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతును కోరుతూ చంద్రబాబు ఒక ట్వీట్‌ను కూడా చేశారు. తాజా జాబితాలో బోడే ప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, అయితాబత్తుల ఆనందరావు వంటి అభ్యర్థులకు అవకాశం కల్పించారు.