అన్నమయ్య జిల్లా…
అధైర్య పడవద్దు, అన్నివేళలా అండగా మీకు మేమున్నాం… నారా భువనేశ్వరి, నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించిన నారా భువనేశ్వరి…
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుని జీర్ణించుకోలేక గుండె పొటుతో మరణించిన కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి…
అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు…అక్కున చేర్చుకున్న తెలుగింటి ఆడపడుచులు…
నేను పౌరుషం కలిగిన తెలుగింటి ఆడబిడ్డ నే…
అన్యాయాన్ని ఎదుర్కొని నిజాన్ని గెలిపిద్దాం అంటూ పిలుపునిచ్చిన నారా భువనేశ్వరి…
అన్యాయాన్ని ఎదుర్కొని నిజాన్ని గెలిపించుకోవాలని నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగవ గొట్టివీడు గ్రామం నాగన్న గుట్ట పాలెం కు చెందిన మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ ప్రభాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు.వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున చేరుకొని స్వాగతం పలికారు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మనోవేదనతో ప్రభాకర్ నాయుడు సతీమణి రెడ్డమ్మ మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై నారా భువనేశ్వరి విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కక్ష సాధింపు చర్యలతోనే అనేక మందిని అక్రమ అరెస్టులకు గురిచేసి మానసిక క్షోభకు గురి చేశారన్నారు. రానున్న రెండు నెలల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ధైర్యంగా నిలబడి నిర్భయంగా ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేను కూడా రాయలసీమ పౌరుషం కలిగిన బిడ్డనని ఎటువంటి భయాలకు భయపడే ప్రసక్తే లేదని వైసీపీ అరాచకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు మీ అందరి కృషితో ముందుకు వెళతానని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేసే వ్యక్తి గాని కీడు చేసే వ్యక్తి కాదు అని, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు చేసినప్పటికీ తప్పు చేసినట్లు నిరూపించలేకపోయారని విమర్శించారు.