కడప: కడప పార్లమెంటు స్థానంలో రసవత్తర పోటీ జరగనుంది. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కాంగ్రెస్ నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో 5 ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లను ఏపీ కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. వైకాపా తరపున వైయస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే పోటీలో ఉన్నారు. కడప గడ్డపై అక్క తమ్ముళ్ల డైరెక్ట్ ఫైట్ జరగనుంది. షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో వైయస్ సునీత పాల్గొనే అవకాశం వుంది. షర్మిల, సునీత ఇద్దరూ అవినాష్ ను ఓడిరచడం ద్వారా వివేకా హత్య కేసులో ప్రజా మద్దతు కోరాలనుకుంటున్నారు.