కుత్బుల్లాపూర్:అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా,అశ్రద్ద అహిస్తున్నారని విద్యార్దులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ,విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన. బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత కొద్ది రోజులుగా అన్నం లో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేసారు. మల్లారెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేసారు. . కాంగ్రెస్నేత మైనంపల్లి హనుమంతరావు విద్యార్థులకు సపోర్ట్ చేసేందుకు వచ్చారు.కళాశాల యాజమాన్యం తో మాట్లాడారు. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని,సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేపారు.