హైదరాబాద్‌, మార్చి 18 : ఢల్లీి లిక్కర్‌ ఫైల్స్‌ లో సీక్సెట్స్‌ లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి.ఎలక్షన్స్‌ ముందు పొలిటికల్‌ కిక్‌ పెరుగుతోంది. ఢల్లీి లిక్కర్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు రిమాండ్‌ విధించింది. ఏడు రోజులు కస్టడీకి అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. లిక్కర్‌ పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో కవిత పాత్ర ఉందని.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. మరోవైపు కవిత అరెస్ట్‌ అక్రమమని ఆమె తరపు న్యాయవాదుల వాదనను కోర్టు తిరస్కరించింది.ఢల్లీి మద్యం కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను 7 రోజులు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో తెలిపారు. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదించారు. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో కవిత భర్త అనిల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్‌ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.
కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు లాయర్లు వాదించారు. లిక్కర్‌ పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో కవిత పాత్ర ఉందని.. తమ వద్ద ఆదారాలు ఉన్నాయని ఈడీ తరఫు లాయర్లు వాదించారు. మాగుంట రాఘవ, బుచ్చిబాబు చాట్స్‌లో కవితకు 30 శాతం లాభాలు అన్న చాట్స్‌ ఉన్నాయని కోర్టుకు తెలిపారు.అరుణ్‌ పిళ్ళై, కవిత భాగస్వామిగా సవిూర్‌ మహేంద్రు కంపెనీలో పెట్టుబడులు పెట్టారన్నారు. గతంలో కవిత ఆధారాలను నాశనం చేశారని.. తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. కవిత అరెస్టులో నిబంధనలన్నీ పాటించామని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాదులు తెలిపారు. సుప్రీంకోర్టులో తాము ఇచ్చిన స్టేట్‌మెంట్‌ గతేడాది సెప్టెంబర్‌ 15 తరువాత 10 రోజులు మాత్రమే వర్తిస్తుందన్నఈడీ వాదించింది.మరోవైపు.. కవిత అరెస్ట్‌ చట్ట వ్యతిరేకమని కవిత తరపు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టులో ఈడీ ఇచ్చిన స్టేట్‌ మెంట్‌కి వ్యతిరేకంగా అరెస్ట్‌ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాస్తమయం తరువాత అరెస్ట్‌, ట్రాన్సిట్‌ వారెంట్‌, సీఆర్పీసీ 80, 81 ఉల్లంఘన సహా అనేక అంశాలను వాదనల్లో ప్రస్తావించారు కవిత తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి. అయితే విక్రమ్‌ చౌదరి వాదనను రౌస్‌ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.మరోవైపు కవిత రిమాండ్‌ రిపోర్టులోనూ కీలక విషయాలను ఈడీ ప్రస్తావించింది. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో కవిత ప్రధాన సూత్రధారుల్లో ఒకరని ఈడీ తెలిపింది. లిక్కర్‌ స్కామ్‌లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని తెలిపింది. సౌత్‌ లాబీలో వ్యక్తులతో కలిసి ఆప్‌ నేతలకు 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారన్నారు.ఇందులో శరత్‌ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రమేయం ఉందని తెలిపారు. మార్జిన్‌ మనీని 12 శాతానికి పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేశారు. లిక్కర్‌ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని.. సమన్లు జారీచేసిన తరువాత నాలుగు ఫోన్ల డేటాను ఫార్మాట్‌ చేశారన్నారు. ఢల్లీి లిక్కర్‌ కేసులో కవిత కీలక వ్యక్తి అని.. ఆప్‌ నేతలతో 100 కోట్ల రూపాయల ముడుపుల డీల్‌ చేసింది కవితనే అని రిమాండ్‌ రిపోర్టులో ఈడీ తెలిపింది.ఈడీ కస్టడీలో కవితను కలిసేందుకు 9 మందికి కోర్టు అనుమతించింది. కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు.. ముగ్గురు పీఏలు, ఇద్దరు న్యాయవాదులు కలిసేందుకు కోర్టు అనుమతించింది. అలాగే.. ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. మార్చి 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. ఈడీ కార్యాలయంలో కవితను ప్రశ్నించనున్నారు అధికారులు. మార్చి 23 మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *