ఢల్లీి లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్
ఢల్లీి లిక్కర్ కేసులో.. కవిత ఇంట్లో సుమారు 4 గంటలపాటు సోదాలు
ఢల్లీి నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు
పలు కీలకమైన పత్రాలను స్వాధీనం
పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు
హైదరాబాద్ మార్చ్ 15: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. ఢల్లీి నుంచి ప్రత్యేకంగా వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఢల్లీి లిక్కర్ కేసులో.. కవిత ఇంట్లో సుమారు 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు. ఢల్లీి నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది. ఐటీ, ఈడీ అధికారులతో కలిసి జాయింట్‌గా.. మొత్తం నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనీఖీలు చేస్తున్నారు. మరోవైపు కవిత నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. దాడుల నేపథ్యంలో కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. బిఆర్‌ఎస్ లీగల్ కన్వీనర్ సోమ భరత్, లాయర్లు కవిత నివాసానికి చేరుకున్నారు. న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించబోమని ఈడీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోందిబీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు..పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ సోదాలతో బీఆర్‌ఎస్‌లో ఒకింత ఆందోళన మొదలైంది. కాగా.. ఢల్లీి లిక్కర్ కేసులో కవిత నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినప్పటికీ ఈ మధ్య హాజరుకాలేదు.గత పదేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తున్నది. కవిత, ఆమె సహాయకుల సెల్‌ఫోన్స్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఢల్లీి లిక్కర్ స్కాం కేసులో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తనపై చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలన్న కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా పడిరది. ఈ గ్యాప్‌లోనే కవిత ఇంటిపై ఐటీ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు జాయింట్ సోదాలు చేయడం గమనార్హం.