ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదు
పశ్చిమ దేశాలను హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌
మాస్కో మార్చ్‌ 13:ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. మార్చి 1517 మధ్య రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక విూడియాతో మాట్లాడారు. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన అవసరం రష్యాకు లేదని స్పష్టం చేశారు. ‘‘ సాంకేతికంగా అణు యుద్దానికి రష్యా సిద్ధంగా ఉంది. కానీ అందుకు తొందరపడడం లేదు. మాకు కొన్ని విధి విధానాలున్నాయి. ఈ విషయం అమెరికాకు తెలుసు.ఒక వేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని పంపితే యుద్ధంలో ఆ దేశం నేరుగా జోక్యం చేసుకున్నట్టే. దానికి తప్పకుండా బదులిస్తాం. రష్యాఅమెరికా మధ్య సంబంధాలను వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు చాలా మంది నిపుణులు ఉన్నారు’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలన్నారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు చేపడితే , రష్యా కూడా వాటిని పరీక్షిస్తుందని పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో పుతిన్‌ విజయంపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *