సంగారెడ్డి జిల్లా లో రూ.9021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
సంగారెడ్డి మార్చ్‌ 5: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరంగా కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని, నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో రూ.9021 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని బేగంపేటలో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇది దేశంలోనే మొదటదని వెల్లడిరచారు.ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్‌, తెలంగాణకు గుర్తింపు వస్తుందని చెప్పారు. ఏవియేషన్‌ కేంద్రం.. స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందన్నారు. గత పదేండ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపయిందని చెప్పారు. పలు కొత్త రైలు మార్గాలు, విద్యుదీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఘట్‌కేసర్‌`లింగపల్లి ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసు ఇప్పటికే ప్రారంభమైందని గుర్తుచేశారు. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పారాదీప్‌ నుంచి హైదరాబాద్‌కు పైప్‌లైన్‌ పనులు చేపట్టామన్నారు.దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నారని ప్రధాని అన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం మౌలిక సౌకర్యాల కల్పన ఆవశ్యకమని చెప్పారు. మౌలిక సౌకర్యాల కోసం బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడిరచారు. సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. దీనిద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య అనుసంధానత ఏర్పడుతుందన్నారు. దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *