స్త్రీ పురుష సమానత్వానికై సంఘటితంగా ఉద్యమిద్దాం
నిజమాబాద్‌ లో అంతర్జాతీయ శ్రామిక మహిళా ప్రదర్శన`సదస్సులో
సిపిఐ(ఎం.ఎల్‌) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్‌ పిలుపు
నిజమాబాద్‌ మార్చ్‌ 5:అంతర్జాతీయ మహిళా పోరాటదినం మార్చి 8 ప్రకటించి సరిగ్గా 114 సంవత్సరాలు అని, ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక మహిళలు తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా జరుపుకొనే కార్యక్రమని సిపిఐ(ఎం.ఎల్‌)చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్‌ తెలియజేస్తూ స్త్రీ పురుష సమానత్వానికై సంఘటితంగా ఉద్యమించాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐపీఓడభ్ల్యూ) కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో నిజమాబాద్‌ ఐపీఓడభ్ల్యూ జిల్లా నాయకురాలు, సదస్సు సభాక్ష్యురాలు బొనుగుల లలిత అధ్యక్షతన అంతర్జాతీయ శ్రామిక మహిళాదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మధ్యకాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక మార్పులు సంభవించాయని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నేటికి స్త్రీ పురుషునితో సమానంగా చూడబడడంలేదని ఐపీఓడభ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంపంగి పద్మ అన్నారు. అనాదికాలంగా స్త్రీ గౌరవించబడాలి, పూజించబడాలని పుక్కిటి పురాణాలు చెబుతున్నాయని ఎండగట్టారు. ఆకాశంలో సగం, పోరులో సగం అయిన మహిళలు ఇంకా పురుషాధిక్యత క్రింద నలిగిపోతున్నారని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నగ్జల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ రైతాంగ ప్రతిఘటన పోరాటాల్లో మహిళలు ముందు నిలిచి పోరాడారని ఐపీఓడభ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పెర్క సునీత గుర్తు చేశారు. అమరుల నెత్తుటి త్యాగాన్ని భుజాన నెత్తుకొని భూమి, భుక్తి, విముక్తికోసం ఎందరో శ్రామిక మహిళాలు అమరులైయ్యారని, నిత్య నిర్భందాల మద్య ఆటుపోటుల మద్య ఎందరో మహిళా కామ్రేడ్స్‌ నేటికి సమసమాజ స్థాపనకొరకు మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ముందుండి పోరాడుతున్నారని అన్నారు. అలాంటి వారందరికి ఐపీఓఢబ్ల్యూ 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా విప్లవ జేజేలు సునీత తెలియజేశారు.1910 న డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌ హాగన్‌ లో జరిగిన రెండవ సోషలిస్టు కాన్ఫరెన్స్‌ లో జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు క్లారాజెట్కిన్‌ మార్చి 8 ని శ్రామిక మహిళా పోరాటదినంగా ప్రకటించిందని, అప్పటినుండి ప్రపంచంలోని అన్ని దేశాలలోని శ్రామిక మహిళలు తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎత్తిపడ్తున్నారని దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య అధ్యక్షులు మహమ్మద్‌ రషీద్‌ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఘనంగా తమ పోరాట స్ఫూర్తిని చాటుతూ ప్రదర్శనలు, సభలు, సమావేశాలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చర్చించుకొని, ప్రణాళిక బద్దంగా ఉద్యమించెందుకు ప్రతినభూనే దినమే మార్చి 8 అని భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి చిట్టిబాబు అన్నారు. ఫ్యాక్టరీ యజమానులకు లాభాలే ప్రధానం గనుక 1857 మార్చి 8 న అమెరికా జౌళిమిల్లులో పనిచేసే మహిళా కార్మికులు 15 నుండి 18 గంటల వరకు వెట్టిచాకిరి చేసేవారని, అతితక్కువ కూలీలు ఇచ్చి, శ్రమ దోపిడీకి గురిచేశారని గుర్తుచేశారు. ఈ దారుణమైన శ్రమ దోపిడిని వ్యతిరేకిస్తూ 18 వ శతాబ్దంలోనే 10 గంటల పనివేళలకోసం, మెరుగైన సౌకర్యాలకోసం సమ్మెలు చేశారు. ఈ సమ్మెలను అణిచివేయడానికి అప్పటి ప్రభుత్వాలు, యజమానులు దారుణంగా అణిచివేయడానికి కుట్ర పన్నారని ఈ సందర్భంగా న్యూయార్క్‌ లోని 146 మంది ట్రయాంగల్‌ ఫ్యాక్టరీ కార్మికులను పని ప్రదేశంలో ఫ్యాక్టరీ గేట్లను, తలుపులను మూసి, నిప్పుపెట్టి సజీవదహనం చేశారని తెలియజేశారు. అనాటి శ్రామిక మహిళల త్యాగాల వలనే నేడు 8 గంటల పని హక్కు, సౌకర్యాలు పొందగలిగలిగామని, నేడు ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణ వలన అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురైయ్యి, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్లకు దేశ సంపదలను దోచిపెడుతున్నారని ఐ.ఎఫ.టి.యు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. సుదాకర్‌ అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు హరించి వేయబడుతున్నాయని ఆగ్రహించారు. ప్రజా వ్యతిరేక చట్టాలతో అప్పులు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆకలిచావులు, దారిద్య్రం, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని ఐపీఓడభ్ల్యూ ఎ.పుణ్యవతి స్పష్టం చేసారు. భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్థాన్‌, భూటాన్‌ లాంటి పరిణామాలు భారతదేశానికి సంభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి క్రమంలో యావత్‌ భారతదేశ శ్రామిక విప్లవ మహిళాలోకం సంఘటితం అవ్వాలని, అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట వారసత్వాన్ని కొనసాగించి, అసమానతలకు, తమపై జరిగే హింస, దోపిడి, పీడన, అణిచివేతలకు వ్యతిరేకంగా సంఘటితం అవ్వాలని ఏపిఎంఎస్‌ అధ్యక్షులు మంతూరి అంజినేయులు పిలుపునిచ్చారు. సకలరంగాల శ్రామిక ప్రజల సమస్యలకు వర్గ సమాజమేనని గుర్తించి, ఈ దేశంలో వర్గంతోపాటు కులం కూడా బలంగా ఉందని, వర్గ నిర్మూలనలో భాగంగా కుల నిర్మూలన పోరాటాలలో శ్రామిక మహిళాలోకం చురుకుగా కొనసాగాలని ఇఫ్టూ (శ్రామిక స్పందన) జాతీయ కార్యదర్శి షేక్‌ షావలి కోరారు. అర్థ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో శ్రామిక విముక్తి జరిగితేనే స్త్రీ విముక్తి సాధ్యమని గ్రహించాలని స్పష్టం చేశారు. నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనలో పురుషులుతో పాటు స్త్రీలు పాల్గొనాలని, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణ మతోన్మాదానికి వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని మార్చి 1 నుండి 8 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఇనుప సురేష్‌ జీవన్‌, పళిని, బొట్ల రాజు, అరుణ, పావనీ, ఎం.పుణ్యవతి, మైమూద్‌ తదితరులు ప్రసంగిస్తూపురుషాధిక్యత బావజాలనికి వ్యతిరేకంగా, సంపూర్ణ స్త్రి విముక్తి సాధనకై పోరాడుదాం అని పిలుపునిచ్చారు. సదస్సు ప్రారంభంలో రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి నిజమాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ వరకు ప్రదాన రహదారులగుండా ప్రదర్శనను నిర్వహిస్తూ..అత్యచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, వరకట్న దురాచారాలు లాంటి అన్నిరకాల హింసలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. సభ అనంతరం మత, కుల, లింగ, వర్గ, ప్రాంతీయ, స్త్రీ`పురుష వివక్షతలకు వ్యతిరేకంగా, మణిపూర్‌, కాశ్మీర్‌, అస్సాం, చత్తీస్‌ ఘడ్‌, రaూర్కండ్‌, లాల్‌ ఘడ్‌, ఆంధ్రప్రదేశ్‌ లాంటి ఏజేన్సీ ప్రాంతాలలో జరుగుతున్న సామూహిక అత్యాచారాలకు వ్యతిరేకంగా సంఘటితంగా అన్నివర్గాల మహిళలు పోరాడుదాం అని నినదించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *