వీరబల్లి మార్చి 1 : వైకాపా, తెలుగుదేశం రాష్ట్రాన్ని దోచేసి అప్పుల పాలు చేశారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు శుక్రవారం మట్టి పంచాయతీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాల అయిందని తెలిపారు, ఓబీసీ మోర్చా జాతీయనాయకులు బత్తల రాజేష్ మాట్లాడుతూ ఒక్క సారి సీఎం జగన్కు అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయకుండా దాచుకో దోచుకో పరిపాలించారన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ మాదిరిగా చెప్పుకునే తెలుగు వారు ప్రస్తుతం చెప్పుకోలేకున్నా రన్నారు పథకాలు కేంద్రాన్నివి ఫోటోలు రాష్ట్రాని వి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్కి ప్రెషర్ కోట్లు ఇచ్చిందన్నారు అన్నమయ్య, పింఛా డ్యాం ము లు నేటికి పూర్తి చేయక పోవడంతో ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కరవుగా మారిందన్నారు. ఇసుక తరలించిన సొమ్ములో సగభాగం ఖర్చు చేసి ఈ డ్యాంలు పూర్తి అయ్యేవన్నారు. మన ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలించి కోట్లు రూపాయలు ప్రజాప్రతినిధు లు సంపాదించుకుంటున్నారన్నారు . వైకాపా పాలనలో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరలు విపసరీతంగా పెంచి ఇబ్బందులకు గురి చేశారన్నారు. మద్యపాన నిషేదం అని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసులు బిజెపి నాయకులు అనంతరాజు బిజెపి పలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *