వయో వృద్ధులకు చట్టం ఆసరా
సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
కోరుట్ల:సీనియర్ సిటీజన్స్(వయోధికులకు ) కోసం చట్టం ఆసరాగా ఉందని,వయోధికుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు..శుక్రవారం కోరుట్ల పట్టణంలోని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కౌన్సెలింగ్ కేంద్రంలో వయోధికుల రక్షణ,పోషణ సంక్షేమ చట్టంపై వయోధికులకు అవగాహన కల్పించారు. వయో వృద్ధులు తమను నిరాదరిస్తున్న కొడుకులపై పెట్టిన కేసుల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ ముఖ్య అతిథిగా,ప్రధాన వక్తగా హాజరయ్యారు..నిరాదరణకు గురైన వయోధికులైన తల్లిదండ్రులు సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికారికి ఫిర్యాదు చేస్తే వారి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.ఆర్డీవో తీర్పును పాటించక పోతే 3 నుంచి 6 నెలల జైలు శిక్ష విధించే వీలుందన్నారు.జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఆధ్వర్యంలో జిల్లాలో ఆర్డీవో లు వృద్ధుల కేసుల పరిష్కారం లో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిచారని పేర్కొన్నారు. 80 ఏళ్ల వయోధికులకు ఎన్నికల కమిషన్ ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించిందని,సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అస్సోసియేషన్ రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తింపు పొందిన అసోసియేషన్ అంటూ వయో వృద్ధులైన తల్లిదండ్రులకు అండగా ఉంటుందన్నారు.కోరుట్ల డివిజన్ లో తమ అస్సోసియేషన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్,మెట్ పల్లి డివిజన్ లో అధ్యక్షుడు ఒజ్జెల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్ లను వయోవృద్ధులైన తల్లిదండ్రులు సంప్రదించాలని సూచించారు.కోరుట్ల డివిజన్ కేంద్రంలో తమ అసోసియేషన్ కార్యాలయ కౌన్సిలింగ్ కేంద్రం కు ప్రహరీ గోడ నిర్మాణం చేయిస్తామని హావిూ ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు,అసోసియేషన్ కు అన్ని విధాలా సహకారం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర నేతలు జువ్వాడి నర్సింగరావు,కృష్ణారావు లకు తమ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.చట్టం లో 2019లో చేసిన సవరణలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించాలని ,అందుకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. ఈ అవగాహన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు,కౌన్సెలింగ్ అధికారి పి.సి.హన్మంత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు కౌన్సెలింగ్ అధికారులు పబ్బా శివానందం,కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్,కోశాధికారి ఎన్.లక్ష్మీ నారాయణలు,
ఉపాధ్యక్షుడు ఎం.డి.సైఫోద్దిన్, సంయుక్త కార్యదర్శులు లక్ష్మీకాంతం,రాజయ్య,చిలుక గంగారాం,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జెల బుచ్చిరెడ్డి,
కార్యదర్శి సౌడాల కమలాకర్,
మాచాపూర్ వెంకటేశ్వర రావు,
సాజిద్ అలీ,కథలాపూర్ అధ్యక్షుడు అల్లూరి బాపురెడ్డి,
మేడిపల్లి అధ్యక్షుడు ఒద్దినేని గోవర్ధన్ రావు,కార్యదర్శి ఎండి.బురాణోద్దీన్, మండలాల,గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.