పత్యేక హోదా ఆంధ్రుల హక్కు
మార్చి 1 న అభివృద్దిపై డిక్లరేషన్‌:వైఎస్‌ షర్మిలా రెడ్డి
విజయవాడ:అనంతపురంలో ఇచ్చిన గ్యారెంటీ సంక్షేమం కోసం అయితే, మార్చ్‌ 1 న రాష్ట్ర అభివృద్ది కోసం ఒక డిక్లరేషన్‌ చేయబోతున్నాం. తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా పై డిక్లరేషన్‌ ఇస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా సాధన పై ఎవరికి చిత్తశుద్ది లేదు. రాజకీయం కోసం హోదా అంశాన్ని వాడుకున్నారని అన్నారు.
అధికారంలో వచ్చాక హోదా ఊసే ఎత్తలేదు. అనాడు 5 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీ హోదా ఇచ్చింది. బీజేపీ 10 ఏళ్లు ఇస్తామని తిరుపతి వేదికగా మాట ఇచ్చారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికగా,అదే మైదానంలో డిక్లరేషన్‌ ప్రకటిస్తాం. చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగారు. అదే వేదికగా మోడీ 10 ఏళ్ల హోదా తో పాటు ఎన్నో హావిూలు ఇచ్చారు. రాష్ట్రాన్ని హర్డ్‌ వేర్‌ హబ్‌ చేస్తామని మాట ఇచ్చారు. పెట్రోలియం రీసెర్చ్‌ సెంటర్‌ అన్నారు. ఇంధన సంస్థలకు రాష్ట్రాన్ని హెడ్‌ క్వార్టర్‌ చేస్తా అన్నారు. డిల్లీ నీ తలపించే రాజధాని నిర్మాణానికి సహకారం అన్నారు. ఇచ్చిన ఒక్క వాగ్దానం అమలు కాలేదు. మోడీ రాష్ట్రాన్ని మోసం చేస్తే…ఇక్కడ ఉన్న పాలక పక్షం,ప్రతిపక్షం ఊడిగం చేస్తున్నాయి. 10 ఏళ్లలో ఒక్క ఉద్యమం చేసింది లేదు. హోదా లేక రాష్ట్రం అభివృద్ధిలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. హోదా పొందిన రాష్ట్రాలు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాయి. ఉత్తరాంఖడ్‌ రాష్ట్రంలో 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లో 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి. 972 కిలోవిూటర్‌ తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రం హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. హోదా సంజీవని కాకపోతే హోదా ఉన్న మిగతా రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందాయి ? హోదా వచ్చి ఉంటే లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి. ఉపాధి అవకాశాలు ఉండేవి. కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్‌ లు గా వచ్చేవి. కేంద్రం ఇచ్చే బడ్జెట్‌ లో 30 శాతం నిధులు వచ్చేవి. పన్ను మినహాయింపు దక్కుతుంది. దీంతో ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. ఆంధ్ర లో ప్రతి జిల్లా ఎంతో అభివృద్ధి చెందేది. ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధి చెందేది. ఇద్దరు ముఖ్యమంత్రుల పుణ్యమా అని హోదా వెనక్కు వెళ్ళింది. ` అంధుల హక్కు అని చెప్పిన చంద్రబాబు అధికారం అనుభవించారు. హోదా అడిగితే జైల్లో పెట్టారు. హోదా ఏమైనా సంజీవని నా అని ఎద్దేవా చేశారని అన్నారు.
జగన్‌ ఆన్న ప్రతిపక్షంలో ఉండి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. 25 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదో చూద్దాం అన్నాడు. హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు. అధికారంలో వచ్చాకా మాట మార్చారు. ఇద్దరి రాజకీయం కోసం ఆంధ్ర రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు…రాష్ట్ర హక్కులను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. 2019 లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 1.18శాతం మాత్రమే. అయినా వైఎస్సార్‌ బిడ్డ కాంగ్రెస్‌ పార్టీలో చేరింది అంటే…కేవలం విభజన హావిూల సాధన కోసమేనని అన్నారు.
కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే హోదా పై చిత్తశుద్ది ఉంది. రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే కాంగ్రెస్‌ కి చిత్తశుద్ది ఉంది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ హావిూ ఇచ్చారు. కేంద్రంలో,రాష్ట్రంలో అధికారం రాగానే హోదా ఇస్తామని…మొదటి సంతకం పెడతామని హావిూ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. బీజేపీ కి అమ్ముడు పోయిన పార్టీలతో లాభం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి భలం లేదు అని తెలిసినా కూడా బలమైన నిర్ణయం తీసుకున్న. కాంగ్రెస్‌ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నిర్ణయం తీసుకున్న. ఇందిరమ్మ అభయం గొప్ప పథకం. పేదరికం నిర్మూలన కోసం,అసమానతలు తొలగించే పథకమని అన్నారు.
ఎంతో దూర దృష్టితో పథకం రూపకల్పన జరిగింది. రాష్ట్రంలో పేదవారిని పట్టించుకొనే పరిస్థితి లేదు. పేదవాడు తింటున్నాడా? లేదా అని పట్టింపు లేదు. రాష్ట్రంలో పేదలు బ్రతుకే పరిస్థితి లేదు. గ్రౌండ్‌ లెవల్‌ లో పూర్తిగా అధ్యయనం చేశాకే ఈ పథకం రూపకల్పన చేశాం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *