రాంప్రసాద్‌రెడ్డి కుటుంబ నేపథ్యం:

అన్నమయ్యజిల్లా,రాయచోటి: అన్నమయ్యజిల్లా ,రాయచోటి మండలం చిన్నమండెం మండలానికి చెందిన మండిపల్లి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా  నేడు (శనివారం) టిడిపి అధిష్ఠానం ప్రకటించింది.
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిది ఉమ్మడి కడపజిల్లా,(ప్రస్తుత ) అన్నమయ్యజిల్లాలోని చిన్నమండెం మండలం,బోడిరెడ్డిగారిపల్లె.మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి,తల్లి సుశీలమ్మ వీరికినలుగురు సంతానం.శ్రీలతారెడ్డి , శ్రీ విద్య,రాంప్రసాద్‌రెడ్డి,లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి.మండిపల్లి నాగిరెడ్డి 1985-1989 1989-1991లో రెండు పర్యాయాలు రాయచోటి నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఎమ్మెల్యేగా వున్నప్పుడే 1991 లో   గువ్వలచెరువు ఘాటుపై రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అనంతరం నాగిరెడ్డి సోదరుడి కుమారుడు మండిపల్లి నారాయణరెడ్డి రాజకీయ అరంగ్రెటం చేశారు. 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో మండిపల్లి నారాయణరెడ్డి గెలుపొందారు. మళ్లీ 1994లో నారాయణరెడ్డి గెలుపొంది 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు నారాయణరెడ్డి. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తల్లి సుశీలమ్మ  ఎంపిపిగా పనిచేశారు. .2004లో  మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి   అక్క శ్రీమతి మిన్నంరెడ్డి శ్రీలతారెడ్డి కాంగ్రెస్‌పార్టి నుంచి రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి స్వల్పమెజార్టీ 3,600ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దంతవైద్య నిపుణులుగా చదువుతున్న రోజుల్లోనే తన అక్క శ్రీమతి మిన్నంరెడ్డి శ్రీలతారెడ్డి ఎన్నికల సందర్భంగా రాజకీయ అరంగ్రెటం చేశారు. రాంప్రసాద్‌రెడ్డి భార్య హరితరెడ్డి వీరికి ఇద్దరు సంతానం.నిచ్చల్‌ నాగిరెడ్డి,నాగ వైష్ణవి రెడ్డి. తమ్ముడు లక్ష్మిప్రసాద్‌ రెడ్డి,ఆయన భార్య సౌమ్యరెడ్డి వీరికి ఇద్దరు సంతానం.  శ్రీమతి మిన్నంరెడ్డి శ్రీలతారెడ్డి 2004 ఓటమి అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయాంలో రాంప్రసాద్‌రెడ్డి పిసిసి మెంబర్‌గా పనిచేశారు. తన తండ్రి నాగిరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా రాయచోటి నియోజవర్గం ప్రజలతో రాంప్రసాద్‌రెడ్డి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి.మైనార్టీలలో ప్రత్యేక గుర్తింపువుంది. సౌమ్యుడు,ప్రజాభిమానం గల నాయకుడు,నిత్యం ప్రజాసేవలో వుండే వ్యక్తిగా రాంప్రసాద్‌రెడ్డి నియోజవర్గ వ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున వున్నారు. అనంతం2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డారు.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణం అనంతరం రాయచోటిలో వచ్చిన (2012 )ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీనుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.2014లో సమైఖ్యాంధ్ర పార్టీనుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి గెలుపునకు కృషిచేశారు.అనంతరం జరిగిన రాజకీయ చదరంగంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఎట్టకేలకు 2024 తెలుగుదేశంపార్టీ ఎమ్యెల్యే అభ్యర్థిగా రాయచోటి నుంచి పోటీలో వున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *