విజయవాడ:వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు జరిగాయి. శుక్రవారం నాడు ఆంధ్రరత్న భవన్ లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో సిపిఐ,సిపిఎం నేతలు సమావేశమయ్యారు. సీపిఎం నుంచి ఎం ఎ ఓ.ం గఫూర్, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు, సిపిఐ నుంచి నుంచి రామకృష్ణ, నాగేశ్వర రావు, ఆకినేని వనజ, జల్లి విల్సన్ హాజరు అయ్యారు. షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్` సీపీఐ` సీపీఎంల మధ్య ఏపీలో పొత్తు కుదిరింది. 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యూనిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం. కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యమని అన్నారు. రామభక్తులమని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హావిూలను తుంగలో తొక్కారని అన్నారు.