ముంబై, ఫిబ్రవరి 20:సార్వత్రిక ఎన్నికల ముందు మహారాష్ట్ర అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఒక్కరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ బిల్లును ఆమోదించింది. మరాఠా రిజర్వేషన్‌ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది.ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి నివేదికను మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్‌ శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనకపబడిన మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపర్చింది.మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అసెంబ్లీలో పేర్కొన్నారు. సుమారు 2.5 కోట్ల మంది మరాఠాలపై సర్వే జరిపించినట్లు తెలిపారు. మరాఠా రిజర్వేషన్‌ బిల్లు కోసమే మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని.. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చట్ట ప్రకారం మరాఠా రిజర్వేషన్‌ కల్పిస్తామని ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు.మరాఠా రిజర్వేషన్‌ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *