హైదరాబాద్‌, ఫిబ్రవరి 19:ఈ రోజుల్లో చిన్నా చితకా పెళ్లిళ్లే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పెళ్లివేడుక.. జీవితంలో ఒకే ఒకసారి వచ్చే సంబరం. ఈ వేడకును జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించాలనకుంటారు. అందుకే పెద్దలు పెళ్లిచేసి చూడు ఇళ్లు కట్టి చూడు అని కూడా అంటారు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు శక్తికి మంచి ఖర్చు చేస్తున్నారు. మరి డబ్బులంటేనే కొదవలేని కుటుంబాలు…దేశంలోనే ఓ రకమైన గుర్తింపు కలిగిన రాజకీయ కుటుంబాలు, పైగా ఓ రాష్ట్రానికి జాతీయపార్టీ అధ్యక్షురాలి కుమారుడి ఇంట పెళ్లి వైభవం ఏ రేంజ్‌ లో ఉంటుందో మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీముఖ్యమంత్రి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి మేనల్లుడు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలి కుమారుడి వివాహం ఎంత ఘనంగా జరిగిందో ఆ విశేషాలు చూద్దాం..డెస్టినేషన్‌ మ్యారేజిస్‌ ఇప్పుడు పెద్దపెద్ద కుటుంబాల్లో ఎక్కడ విన్నా ఇదే పేరు వినపడుతోంది. ఒకప్పుడు అంటే పచ్చని పందిళ్లు, వేలాదిమంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిగేవి. పెళ్లికి ఎంతమంది అతిథులు వస్తే ఆ పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు చెప్పుకునే వారు కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారిపోయింది. పెళ్లి వైభోగం జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.. కానీ పెళ్లికి వచ్చే అతిథిలను రిసీవ్‌ చేసుకోవడం, పెళ్లికి కావాల్సిన వస్తువులు మర్చిపోవడం, హడావుడిగా తోసుకుంటూ, తొక్కుకుంటూ పెళ్లి కార్యక్రమం నిర్వహించడం పెద్ద రిస్క్‌ గా మారిపోయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పెళ్లి వేడుక చూశాం కదా…ఎంత హడావుడి జరిగిందో. ఇక రాజకీయ నేతల ఇళ్లల్లో పెళ్లి అంటే కార్యకర్తలు, అభిమానుల సందడి అంత,ఇంతా ఉండదు. అందుకే ఇప్పుడు ప్రతిఒక్కరూ డెస్టినేషన్‌ మ్యారేజ్‌ వైపు మళ్లుతున్నారు. ఈ వేడుకలు కేవలం కుటుంబ సభ్యులు, అతి దగ్గర మనుషుల సమక్షంలోనే నిర్వహిస్తారు. కేవలం వంద నుంచి 150 మందికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి తంతు ముగిస్తారు. ఆ తర్వాత కావాలనుకుంటే వేలాది మందితో రిసెప్షన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. మనదేశంలో డెస్టినేషన్‌ మ్యారేజీస్‌ కి కేరాఫ్‌ అడ్రస్‌ రాజస్థాన్‌( లోని జోథ్‌ పూర్‌. ఇక్కడ అనేక పెళ్లి మండపాలు ఉన్నా….భాగ్యవంతుల ఓటు మాత్రం జోధఫూర్‌ ప్యాలెస్‌ కే…ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకుమారుడి వివాహం కూడా రాజస్థాన్‌ లోని జోధపూర్‌ ప్యాలెస్‌ లోనే జరిగింది. మామూలు స్థాయి వ్యక్తుల విహహం ఇక్కడ చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ ప్యాలెస్‌ అద్దె రూ.15 కోట్లు ఉంటుంది. అంత అద్దె చెల్లించి భవనాన్ని తీసుకున్న తర్వాత సెక్యూరిటీ ఏ రేంజులో ఉంటుందో మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ల పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రావడం వారికి అంతగా ఇష్టం ఉండదు. కాబట్టి అనుమతి లేకుండా చీమ కూడా లోపలకి వెళ్లకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటాయి. అతిథులకు ఇచ్చే ఇన్విటేషన్‌ కార్డుపైనే బార్‌ కోడ్‌ లు ఉంటాయి. వీటిని స్కాన్‌ చేసిన తర్వాతే వారిని లోపలకి అనుమతిస్తారు. బార్‌ కోడ్‌ స్కాన్‌ అయితేనే లోపలికి అనుమతి ఉంటుంది లేకుంటే తిరిగి వెనక్కి వెళ్లి పోవాల్సిందే.షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం వేడుకలు మూడురోజులు సాగగా..మూడురోజులకు వేర్వేరు బార్‌ కోడులు ఇచ్చారు. తొలిరోజు హిందూ సంప్రదాయంలో రెండోరోజు క్రిస్టియన్‌ పద్దతుల్లో పెళ్లి వేడుక నిర్వహించారు.
షర్మిల `అనిల్‌ తరపున 100 కుటుంబాలు..పెళ్లి కూతురు తరపున 50 కుటుంబాలకు మాత్రమే ఆహ్వానం ఉంది. అంతకు మించి ఏ ఒక్కరిని లోపలికి అనుమతించలేదు. ప్రస్తుతం జోద్‌ పూర్‌ ప్యాలెస్‌ తాజ్‌ గ్రూప్స్‌ ఆధీనంలో ఉంది. కాబట్టి ఇక్కడ అతిథులకు అందించే వంటలన్నీ తాజ్‌ గ్రూప్‌ హోటల్స్‌ నుంచే వెళ్లాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన అన్ని రకాల వెరైటీలు మెనూలో ఉంచారు. ఒక్కో ప్లేట్‌ లో దాదాపు 250 ఆహార పదార్థాలు వడ్డించారు. ఐస్‌ క్రీములే దాదాపు 10రకాలు ఉన్నాయంటే ఇక వంటలు ఏ రేంజ్‌ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఆంధ్రా చేపల పులుసు, గోంగూర మటన్‌, ఆంధ్రా కోడి పలావ్‌..హైదరాబాద్‌ బిర్యానీ..రాజస్థాన్‌ స్పెషల్‌ స్వీట్స్‌. అవికాకుండా మరో యాభై రకాల స్వీట్స్‌.. నార్త్‌ ఇండియన్‌ రోటీస్‌ అండ్‌ చికెన్‌.. మటన్‌ లోని అన్ని రకాల నార్త్‌ వెరైటీస్‌ బోత్‌ స్నాక్స్‌ అండ్‌ కర్రీస్‌ .. వెజ్‌ వెరైటీస్‌. స్పెషల్‌ పాన్స్‌ మెనూలో చేర్చారు.పెళ్లికి అందర్నీ ఆహ్వించలేకపోయిన షర్మిల కుమారుడి పెళ్లి రిసెప్షన్‌ మాత్రం హైదరాబాద్‌లో పెట్టారు. ఈనెల 24న హైజదరాబాద్‌ లోని శంషాబాద్‌ లో వివాహ రిసెప్షన్‌ కు షర్మిల ఏర్పాట్లు చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సైతం రానున్నారు. అయితే షర్మిల సొంత అన్న ఏపీ సీఎం జగన్‌ వస్తారా లేదా అన్నది ఇంకా కన్ఫార్మ్‌ కాలేదు. జోధ్‌ పూర్‌ లోజరిగిన వివాహ వేడుకలను కూడా ఆయన హాజరుకాలేదు. ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన నిశ్చయ తాంబూలాల వేడుకకు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు రిసెప్షన్‌ కు వస్తారో లేదో తెలియాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *