భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమర్ ను విమర్శించడం పెద్దిరెడ్డి కి తగదు…
వైసిపి మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన భాజపా రాష్ట్ర మేధావుల సంఘం సభ్యులు పాలగిరి శ్రీనివాస రాజు
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను విమర్శించే స్థాయి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదన్నారు రాష్ట్ర మేధావుల సంఘం సభ్యులు పాలగిరి శ్రీనివాసరాజు. రాయచోటిలో భాజపా నేతలతో కలిసి వారు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న హిందూపురం కేంద్రంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సత్య కుమార్ ను ఎక్కడో పుట్టి ఎక్కడో పోటీ చేయడం ఏంటని కొన్న ఆరోపణలు చేయడం చాలా బాధాకరమన్నారు.సత్యకుమార్ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు లో జన్మించి అతని విద్యాభ్యాసం కూడా అక్కడే చేశారన్నారు.వైసిపి పార్టీ నేతలు మాత్రం రాష్ట్రంలో ఎక్కడైనా అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తున్నప్పుడు మా నాయకులు సత్యకుమార్ పోటీ చేస్తే మీరెందుకు భయపడుతున్నారని వారు విమర్శించారు.విషయాన్ని మీరు గమనించక పోవడం సిగ్గ చేటన్నారు.భవిష్యత్తులో భాజపా నాయకుల పై ఈలాంటి వ్యాఖ్యలు చేస్తే గట్టిగా బుద్ది చెప్పల్సి వస్తుందని వారు హెచ్చరించారు.