విచ్చలవిడిగా మైనింగ్ వల్ల ` చీమకుర్తి కారు మంచి మేజర్ కాలువకు పగుళ్లు
రికార్డ్స్ పరిశీలించిన వినియోగదారుల మండలి
ఇన్లీగల్ మైనింగ్ పై ఆయా సంస్థలపై లోకాయుక్త లో ఫిర్యాదు
ఒంగోలు ఫిబ్రవరి 17:ఒంగోలు జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ వ్యవసాయ భూములు, నీటిపారుదల కాలువలు పరిసరాలలో విచ్చలవిడిగా మైనింగ్, క్వారీల తవ్వకాల వల్ల ` చీమకుర్తి కారు మంచి మేజర్ కాలువకు పగుళ్లు, రహదారి ధ్వంసం పై స్థానికుల ఫిర్యాదు మేరకు, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి, ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు పిడతల రమేష్ రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దూదేకుల బాదుల్లా లు ఒంగోలు మైనింగ్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో చీమకుర్తి మైనింగ్ సంస్థల అనుమతుల రికార్డు లను, సమాచార హక్కు చట్టం 2005 పరిధిలో ‘‘ రికార్డుల పరిశీలన’’ చేయడం జరిగింది. చీమకుర్తి లోని రెండు పెద్ద మైనింగ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా మరియు పక్కనే నీటి కాలువ ద్వంసానికి కారణమైన మైనింగ్ నిర్వహిస్తున్న క్రమంలో లైసెన్స్ లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇన్లీగల్ మైనింగ్ నిర్వహించినందుకు జరిమానా వివరాలు ప్రకటించలేదు.ఇంకా మిగతా మైనింగ్, క్వారీల వివరాలు అందిన పిదప వినియోగదారుల మండలి ఆయా సంస్థలపై లోకాయుక్త లో ఫిర్యాదు చేయనున్నది. అలాగే చీమకుర్తి నుండి ఒంగోలు వెళ్లే స్టేట్ హైవే రోడ్డు కు కేవలం అయిదు విూటర్ల దూరంలో లోనే మైనింగ్ జరుగుతున్న మైనింగ్ సంస్థలు, క్వారీల ప్రదేశాలను నేడు వినియోగదారుల జాతీయ కమిటీ సభ్యులు పరిశీలించారు.