రాయచోటి:రాయచోటి తహశీల్దార్ కార్యాలయం తనకు అన్యాయం చేస్తోందని అర్షద్ అహమ్మద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయచోటి శిఫా హాస్పిటల్ పక్కన నివాసం ఉన్న అర్శద్ తనకు గున్నికుంట్ల రోడ్ లో ఉన్న 75 సెంట్ల భూమిని మరికొందరు వ్యక్తులు ఆన్లైన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న అర్శద్ తండ్రి సులేమాన్ మూడేళ్లుగా న్యాయం కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి గతంలో చనిపోయాడు. తన భూమిని వేరే వ్యక్తులు ఆన్లైన్ చేయించు కున్నారని న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఏళ్లుగా తిరుగుతున్నా కార్యాలయ ఉద్యోగులు పట్టించుకోక పోవడంతో విసిగి కార్యాలయ ఆవరణలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పక్కనే ఉన్న వ్యక్తులు వారిస్తూ అడ్డుకున్నారు. వెంటనే అతని పై పైప్ తో నీళ్ళు చల్లి కాపాడారు. అనంతరం పోలీసులు అర్శద్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.