?మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ
?మార్చి 15 నుండి 30 వరకూ (సెలవు రోజులు మినహా)పరీక్షలు
?డిఎస్సి నిర్వహణకు సంబంధించిన జిఓలు 11,12 విడుదల
?ష్ట్రబిబిజూ//ఞబవ.ణనీల.తిని పేరిచ ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభం
?9505619127,9705655349 ఫోన్ నంబర్లతో ప్రత్యేక హెల్పు డెస్క్ ప్రారంభం
విజయవాడ, ఫిబ్రవరి 12:అమరావతి,12 ఫిబ్రవరి:రాష్ట్రంలో 6వేల 100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆూఅ 2024 నోటిఫికేషన్ ను రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో డిఎస్సి నోఫికేషన్ ను విడుదల చేయడంతో పాటు డిఎస్సి నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన జిఓలు 11,12 లను కూడా ఆయన విడుదల చేశారు. అదే విధంగా డిఎస్సి 2024 సంబంధించిన వెబ్ సైట్ ష్ట్రబిబిజూ//ఞబవ.ణనీల.తిని కూడా మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు యాజమాన్యాలు కింద ఉన్న అనగా జిల్లా పరిషత్,మండల పరిషత్,మున్సిపల్,ఎపి మోడల్ స్కూల్స్,ఎపి రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్ సొసైటి,ఎపి ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ,(గురుకులం),ఎపి ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(ఆశ్రమ్),ఎపి సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసేటీ,మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ ఖాళీలన్నిటినీ రానున్న డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని విూడియాకు స్పష్టం చేశారు.అంతే గాక జీరో వేకెన్సీ అనే విధానంతో ఏడాదికి సంబంధించి ఖాళీలను ఆఏడాదే భర్తీ చేయడం జరుగుతుందని మంత్రి బొత్స తెలిపారు.డిఎస్సి నిర్వహణకు మొత్తం 122 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగు తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.మార్చి 15 నుండి 30 వరకూ కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో ఈపరీక్షలు జరుగుతాయని,పండుగలు,ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి మిగతా రోజుల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. డిఎస్సి 2024 కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ,మరియు పరిష్కారానికి వీలుగు కవిూషనర్ పాఠశాల విద్యాశాఖ వారి కార్యాలయంలో ఇప్పటికే ప్రత్యేక హెల్ప డెస్క్ పనిచేస్తోందని ఆహెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 9505619127 మరియు 9705655349 అని మంత్రి తెలిపారు.ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ ప్రకాశ్ మాట్లాడుతూ డిఎస్సి 2024 కు సంబంధించి రెండు జిఓలు 11,12లను మంత్రి వర్యుల చేతుల విూద విడుదల చేయడం విడుదల చేయడం జరిగిందని చెప్పారు.జిఓ సంఖ్య 11లో ఉపాధ్యాయ నియామకం వంటి పూర్తి వివరాలు దానిలో ఉంటాయని తెలిపారు.అలాగే జిఓ సంఖ్య 12లో వివిధ అర్హతలు వాటికి సంబంధించి వివరాలు పొందుపర్చబడ్డాయని చెప్పారు.రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కవిూషనర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ డిఎస్సి 2024కు సంబంధించి నోటిఫికేషన్ మంత్రివర్యుల చేతుల విూదగా జారీ చేయడం జరిగిందని.ఈనెల 12 నుండి 21 వరకూ అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చని,ఈనెల 22 వరకూ అన్లైన్ లో ధరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు.మార్చి 5వ తేదీ నుండి హాల్ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.మార్చి 15 నుండి 30 వరకూ డిఎస్సి 2024 వరీక్షలు జరుగుతాయని వచ్చిన ధరఖాస్తులు ఆధారంగా మొత్తం పరీక్షా కేంద్రాలు ఎన్ని అనేది నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు.ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సరాసరిన 35 వేల నుండి 40 వేల మంది అభ్యర్ధులు ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు వ్రాసేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఈపరీక్షల నిర్వహణకు సంబంధించి సందేహాలు నివృత్తి,ఫిర్యాదుల పరిష్కారానికై ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కవిూషనర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్పు డెస్కు ప్రతి రోజు ఉదయం 10 గం.ల నుండి సా.5గం.ల వరకూ పనిచేస్తోందని దీనిని అభ్యర్ధులు వినియోగించుకోవాలని సూచించారు.ఇంకా ఈవిూడియా సమావేశంలో ఇంటర్మీడియడ్ బోర్డు కవిూషనర్ సౌరవ్ గౌర్, పాఠశాలల మౌలిక సదుపాయాల విభాగం కవిూషనర్ కె.భాస్కర్,ఎస్పిడి శ్రీనివాస్,మధ్యాహ్న భోజన పధకం డైరెక్టర్ శోభిత ఇతర అధికారులు పాల్గొన్నారు.