లోక్‌సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టం అమలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన
న్యూఢల్లీి, ఫిబ్రవరి 10
దేశంలో సీఏఏ అమలు చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని నోటిఫై చేసి అమలు చేస్తామని అమిత్‌ షా తెలిపారు. ఈ చట్టాన్ని డిసెంబర్‌ 2019లో పార్లమెంట్‌ ఆమోదించిందని.. అంం ఎవరి పౌరసత్వాన్ని హరించదన్నారు. అంం.. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించే చట్టం అని పేర్కొన్నారు అమిత్‌ షా. ఇు ఔనీలి గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ 2024లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. సీఎఎ సహా అనేక పొలిటికల్‌ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
400లకు పైగా సీట్లు ఖాయం..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారు.ఈసారి 400కు పైగా సీట్లు సాధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్‌ ఏవిూ లేదని.. ఈసారి కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలన్నీ విపక్ష స్థానంలోనే ఉంటాయన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని తమ ప్రభుత్వం రద్దు చేసిందని.. ఈ కారణంగానే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌ షా. జయంత్‌ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డి), శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి), మరికొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ ఎన్‌డిఎ కూటమిలో చేరడంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు షా స్పందిస్తూ.. బీజేపీ కుటుంబ నియంత్రణను నమ్ముతోందని అన్నారు. కానీ రాజకీయాల్లో కాదన్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
దేశ విభజనకు ఆ పార్టీయే కారణం..
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రపై స్పందించిన అమిత్‌ షా.. 1947లో దేశ విభజనకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని, ఇలాంటి పాదయాత్రను కొనసాగించే హక్కు నెహ్రూ`గాంధీ వారసులకు లేదన్నారు. పార్లమెంట్‌లో శ్వేతపత్రం విడుదల చేయడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన అమిత్‌ షా.. 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి దేశం ముందు ఎలాంటి గందరగోళ పరిస్థితిని మిగిల్చిందో తెలుసుకునే హక్కు దేశానికి ఉందన్నారు. 2014లో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, మోసాలే ఉన్నాయన్నారు.
ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాం..
ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా పురోగమిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. 10 సంవత్సరాల తర్వాత తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించిందన్నారు. భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చిందన్నారు. ఎక్కడా అవినీతి జరుగలేదన్నారు. అందుకే ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు కేంద్రమంత్రి. ఇదే సమయంలో రామమందిరం గురించి కూడా అమిత్‌ షా ప్రస్తావించారు. రామ జన్మ భూమిలో గుడి కట్టాలన్నది 500 ఏళ్లుగా ప్రజల డిమాండ్‌ ఉందని, కానీ బుజ్జగింపు రాజకీయాలు, శాంతిభద్రతలను నెలకొల్పే ఉద్దేశంతో రామమందిర నిర్మాణానికి అవకాశం ఇవ్వలేదన్నారు. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వం రామ మందిరాన్ని పూర్తి చేసిందని చెప్పారు అమిత్‌ షా.
లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ..
పౌరసత్వ (సవరణ) చట్టం (అంం) 2019లో రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతదేశం అంతటా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమిత్‌ షా తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి నియమాలు జారీ చేస్తామన్నారు. ఈ చట్టంపై ముస్లిం సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, రెచ్చగొడుతున్నారని అన్నారు. పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే అంం అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ చట్టం ద్వారా ఎవరి పౌరసత్వం హరించేది లేదని స్పష్టం చేశారు అమిత్‌ షా.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *