రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచింది…
అన్నదాతలను ఆగం చేసే విధంగా ఉన్న బడ్జెట్‌
మాజీ ఆర్దిక మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు
హైదరాబాద్‌ ఫిబ్రవరి 10: ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ… ప్రజాపాలన అభాసుపాలు అయ్యిందని చెప్పారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రజా దర్బార్‌ను ప్రతిరోజూ నిర్వహిస్తామని చెప్పారని.. కానీ అలా జరగడం లేదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలన్నీ వాగ్ధానాలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రకటించిన హావిూలపై ప్రజలకు నమ్మకం కలిగించలేదన్నారు. అన్నదాతలను ఆగం చేసే విధంగా బడ్జెట్‌ ఉందన్నారు. అంకెలను మార్చి ఆంక్షలు పెట్టే విధంగా బడ్జెట్‌ ఉందని హరీశ్‌ రావు మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ. 19 వేల కోట్ల నిధుల్లో రైతు భరోసా ఎలా అమలు చేస్తారు ? అని ప్రశ్నించారు. రైతు భరోసాకు రూ.22 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. రైతు రుణమాఫీకు బడ్జెట్‌లో మొండి చేయి చూపారని హరీశ్‌ రావు మండిపడ్డారు.
24 గంటల కరెంట్‌ ఎక్కడ..?
రైతు బీమాకు కేటాయింపులు ఎక్కడ ? అని నిలదీశారు. పంటలకు బోనస్‌ ఇస్తామని చెప్పిన మాటలు బోగస్‌గా మారాయని ఆరోపించారు. రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం దగా చేసిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. 24 గంటల కరెంట్‌ సరఫరాను రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారో చూద్దాం పదండి.. లాగ్‌ బుక్‌లు పరిశీలిద్దాం రావాలని సవాల్‌ విసిరారు. ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామని చెప్పారని.. అసెంబ్లీ రెండు సమావేశాలు అయిపోతున్నాయి ఎక్కడ చట్టం. ? చేశారని ప్రశ్నించారు. వంద రోజుల్లో హావిూలు అమలు చేయలేమని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. కాంగ్రెస్‌ పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు. జనవరి నెల ఆసరా పింఛన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, పెండిరగ్‌ డీఏలు ఇవ్వాల్సి ఉన్నా.. వాటికి నిధుల కేటాయింపుపై ప్రస్తావనే లేదని హరీశ్‌ రావు మండిపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *