టిడ్కో ఇళ్ళపై ఈనెల 10న మహాధర్నా..
నెల్లూరు:అధికార దాహం, పదవీ వ్యామోహం తనకు లేదని, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతోనే రాజకీయ అరంగేట్రం చేశానని జనసేన నాయకుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ అన్నారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నడిచే బాటలోనే నా ప్రయాణం సాగుతుందన్నారు. పవన్‌ ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగుతానని, నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నెల్లూరులోని ఓ హోటల్లో గురువారం జరిగిన విూడియా సమావేశంలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. నెల్లూరులో జనసేన పార్టీ బలంగా మారుతోందన్నారు. నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేస్తున్నారని, తనకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. వారి ప్రోత్సాహంతో తాను కూడా రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నానని తెలిపారు.
పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల సంఖ్యలో టిడ్కో ఇళ్ళు నిర్మించిందని జానీమాస్టర్‌ తెలిపారు. ఒక్క నెల్లూరులోనే గ్రేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో వేలాది ఇళ్ళను నిర్మించిందని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్‌ తో ఇళ్ళ పంపిణీ నిలిచిపోయిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ళకు మోకాలడ్డు పెట్టిందన్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే ఆ క్రెడిట్‌ టీడీపీకి వెళ్తుందని భావించి, తామే కట్టినట్లుగా చూపించుకోవడానికి వైసీపీ రంగులేశారని ఎద్దేవా చేశారు. దాదాపు ఐదేళ్ళు గడుస్తున్నా, ఇప్పటికీ లబ్దిదారులకు ఇళ్ళు పంపిణీ చేయలేదని ధ్వజమెత్తారు. ఆ ఇళ్ళు అప్పడే పేదలకు ఇచ్చి ఉంటే, అద్దె బాధలు తప్పేవన్నారు. సరైన నిర్వహణ లేక భవనాలు పాడుబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నిరంకుశవైఖరికి నిరసనగా ఈనెల 10న టిడ్కో ఇళ్ళ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని జానీమాస్టర్‌ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో , చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి , యువత జిల్లా అధ్యక్షుడు ఈగ సురేష్‌ ,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్‌, జనసేన వీర మహిళా నాయకురాలు నాగరత్నం , జనసేన నాయకులు గుడి హరిరెడ్డి ,ప్రశాంత్‌ , కాకు మురళీరెడ్డి , తదితరులు పాల్గొన్నారు .పేదల సొంతింటి కల తీర్చని జగన్‌పై జానీమాస్టర్‌ ధ్వజం
టిడ్కో ఇళ్ళపై ఈనెల 10న మహాధర్నా..
నెల్లూరు:అధికార దాహం, పదవీ వ్యామోహం తనకు లేదని, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతోనే రాజకీయ అరంగేట్రం చేశానని జనసేన నాయకుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీమాస్టర్‌ అన్నారు. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నడిచే బాటలోనే నా ప్రయాణం సాగుతుందన్నారు. పవన్‌ ఆదేశిస్తే ఎన్నికల బరిలోకి దిగుతానని, నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నెల్లూరులోని ఓ హోటల్లో గురువారం జరిగిన విూడియా సమావేశంలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. నెల్లూరులో జనసేన పార్టీ బలంగా మారుతోందన్నారు. నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేస్తున్నారని, తనకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. వారి ప్రోత్సాహంతో తాను కూడా రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నానని తెలిపారు.
పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల సంఖ్యలో టిడ్కో ఇళ్ళు నిర్మించిందని జానీమాస్టర్‌ తెలిపారు. ఒక్క నెల్లూరులోనే గ్రేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో వేలాది ఇళ్ళను నిర్మించిందని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్‌ తో ఇళ్ళ పంపిణీ నిలిచిపోయిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ళకు మోకాలడ్డు పెట్టిందన్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే ఆ క్రెడిట్‌ టీడీపీకి వెళ్తుందని భావించి, తామే కట్టినట్లుగా చూపించుకోవడానికి వైసీపీ రంగులేశారని ఎద్దేవా చేశారు. దాదాపు ఐదేళ్ళు గడుస్తున్నా, ఇప్పటికీ లబ్దిదారులకు ఇళ్ళు పంపిణీ చేయలేదని ధ్వజమెత్తారు. ఆ ఇళ్ళు అప్పడే పేదలకు ఇచ్చి ఉంటే, అద్దె బాధలు తప్పేవన్నారు. సరైన నిర్వహణ లేక భవనాలు పాడుబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నిరంకుశవైఖరికి నిరసనగా ఈనెల 10న టిడ్కో ఇళ్ళ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని జానీమాస్టర్‌ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో , చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి , యువత జిల్లా అధ్యక్షుడు ఈగ సురేష్‌ ,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్‌, జనసేన వీర మహిళా నాయకురాలు నాగరత్నం , జనసేన నాయకులు గుడి హరిరెడ్డి ,ప్రశాంత్‌ , కాకు మురళీరెడ్డి , తదితరులు పాల్గొన్నారు .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *