హైదరాబాద్‌:పంజాగుట్ట పీస్‌ పరిధిలో తెలంగాణ స్టేట్‌ యాంటీ డ్రగ్‌ బ్యూరో, పంజాగుట్ట పోలీసులు ఒక నైజీరియన్‌ డ్రగ్‌ పెడ్లర్‌ ని అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడిరచారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఎర్రమంజిల్‌ ఏరియా లో ఒక వ్యక్తి డ్రగ్‌ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారంతో దాడి చేసి ఇవ్యూలా ఉదోక స్టాన్లీ అనే నైజీరియన్‌ పి పట్టుకున్నాం. అతడినుంచి రూ 8 కోట్ల విలువ గల 557 గ్రాముల కొకైన్‌, 902 ఎక్టసీ వ పిల్స్‌ (390 గ్రాములు), 105 ఎల్‌ఎస్డీ బోల్ట్‌, 215 గ్రాముల చరాస్‌, 21 గ్రాముల హెరయిన్‌, 7 గ్రాముల అంఫేటమిన్‌, 45 గ్రాముల ఓజీ వీడ్‌, 8 సెల్‌ ఫోన్స్‌, 5.4 లక్షల రూపాయల స్వాధీనం చేసుకున్నమని అయన అన్నారు.
నిందితుడు 2009 లో బిజినెస్‌ విసా విూద ముంబై వచ్చి, అక్కడ క్లాత్‌ బిజినెస్‌ చేసేవాడు. సంవత్సరం తర్వాత గోవా కి మకాం మార్చాడు. అక్కడ కొందరు నైజీరియన్లు అతనికి పరిచయం కావడంతో డ్రగ్‌ కి అలవాటు పడ్డాడు. బిజినెస్‌ చేస్తే వచ్చే డబ్బుల కంటే డ్రగ్‌ బిజినెస్‌ చేసే వారి మిత్రులు ఎక్కువ సంపాదిస్తున్నారు అని, ఈజీ మనీ కోసం వారి మిత్రుల వద్ద డ్రగ్‌ సప్లయర్‌ గా చేసేవాడు. స్టాన్లీ మిత్రులు నైజీరియా కి వెళ్లిపోవడం వల్ల, కొంత మంది డ్రగ్‌ వినియోగదారులు స్టాన్లే కి కాల్‌ చేయడంతో వేరే డ్రగ్‌ పెడ్లర్స్‌ నుండి డ్రగ్‌ తీసుకొని అమ్మడం ప్రారంభించాడు. ఎస్‌.ఆర్‌. నగర్‌ పి.ఎస్‌. పరిధిలో అరెస్ట్‌ చేసిన హనుమంత్‌ బబుసో దివాకర్‌ ఇచ్చిన సమాచారంతో స్టాన్లీ లొకేషన్‌ తెలుసుకొని అరెస్ట్‌ చేసామని అయన అన్నారు.
2017 సంవత్సరంలో డ్రగ్స్‌ అమ్ముతున్న స్టాన్లీ నీ గోవా లో అరెస్ట్‌ అయ్యాడని డీసీపీ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *