‘‘ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే.
ప్రజల ఆకాంక్ష మేరకే… ‘జయ జయహే తెలంగాణ’?
ట్విట్టర్ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 5:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ‘‘ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ‘జయ జయహే తెలంగాణ?.’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా తెలంగాణ తల్లిని రూపొందిస్తాం. రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నం రూపొందిస్తాం. వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉంటాయి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే మా నిర్ణయాలు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.కేబినెట్ సమావేశంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ‘‘జయ జయహే తెలంగాణ’’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించడం.. అలాగే వాహన రిజిస్ట్రేషన్లలో ఇక నుంచి టీఎస్ బదులు టీజీగా మారుస్తూ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో మారుతున్న విధానాలు, కేబినెట్‌లో తీసుకున్న సంచలన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.