కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. సామాన్యులకు ఊరటనిచ్చే అంశం బడ్జెట్‌లో లేదని విమర్శించారు. అయితే, కర్ణాటక కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ఎంపీ డీకే సురేశ్‌ దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ పార్లమెంటు వేదికగా చేసి ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది.మధ్యంతర బడ్జెట్‌పై బెంగళూరుకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల బడ్జెట్‌ అని అన్నారు. పథకాలకు కొన్ని సంస్కృత పేర్లు, హిందీ పేర్లు ప్రవేశపెట్టారన్నారు. కేంద్రం దక్షిణ భారత రాష్ట్రాలకు జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేసిన సొమ్మును ఉత్తర భారత రాష్ట్రాలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు డీకే సురేశ్‌. కేంద్రం రాష్ట్రాల నుంచి రూ.4 లక్షల కోట్లకు పైగా వసూలు చేస్తోందని, దానికి ప్రతిఫలంగా అందుతున్నదీ స్వల్పం అన్నారు. దీన్ని సరిదిద్దుకోకుంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాన్ని డిమాండ్‌ చేస్తూ గళం విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.ఎంపీ డీకే సురేశ్‌ చేసిన ప్రత్యేక దేశం వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఖండిరచారు. ‘దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడే వారెవరైనా.. ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. సహించేదీ లేదన్నారు మల్లికార్జున్‌ ఖర్గే. కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు మనం ఒక్కటేనని, మనం ఒక్కటిగానే ఉంటామని స్పష్టం చేశారు. డికె సురేష్‌ ప్రత్యేక దేశం డిమాండ్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే శుక్రవారం రాజ్యసభలో ప్రకటన చేశారు.డీకే సురేశ్‌ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఆఐ సురేష్‌ భారత రాజ్యాంగంపై దాడి అని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అవమానించేలా మాట్లాడారని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీకి సూచించాలని డిమాండ్‌ చేశారు జోషి.మరోవైపు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో మాటల యుద్ధానికి దిగిన డీకే సురేష్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈమేరకు తన చీ హ్యాండిల్‌లో సమాధానం ఇచ్చారు. ‘‘రాష్ట్రకవి కువెంపు, మన నాద గీతంలో, ‘జయ భారత జననీయ తనుజాతే, జయ హే కర్ణాటక మాథే’ అని పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, ‘‘కాంగ్రెస్‌ పార్టీకి ‘విభజించు ? పాలించు’ చరిత్ర ఉందని ఆరోపించారు. దాని ఎంపీ డీకే సురేష్‌ ఇప్పుడు ఉత్తర ? దక్షిణాదిని విభజించాలని కోరుతూ మళ్లీ ట్రిక్‌ ప్లే చేస్తున్నారు’’ అని బిజెపి ఎంపి విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో పన్నుల విభజన చాలా ఎక్కువైందని ఆయన అన్నారు. ‘‘2009`14 నుండి ఙఖం`2 సమయంలో కర్ణాటకకు పన్నుల పంపిణీ రూ. 53,396 కోట్లుగా ఉండగా, 2014`19లో నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో రూ.1.35 లక్షల కోట్లు దాటింది’’ అని సూర్య పేర్కొన్నారు. అటు ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచింది. తెలంగాణలో ఆ పార్టీ 8 సీట్లకే పరిమితమైంది. దీనిపై సామాజిక మాధ్యమాలలో వాదోపవాదాలు సాగుతున్నాయి.ఎన్నికల ఫలితాలు వచ్చాకా కొంతమంది వ్యక్తులు, దక్షిణ బారతాల మధ్య విభజన చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఓ జర్నలిస్టు పోస్టు చేసిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ కూడా రీపోస్టు చేశారు.‘‘ఈ విభజన అజెండా పట్ల జాగ్రత్తగా ఉండాలి. 70 ఏళ్ళ ఈ అలవాటు అంత తొందరగా పోదు’’ అని ప్రధాని మోదీ రాశారు.దీనికీతోడు డీఎంకే ఎంపీ సెంథిల్‌ కుమార్‌ పార్లమెంటులో హిందీ బెల్ట్‌ రాష్ట్రాలలో బీజేపీ గెలుపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ, తరువాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చలో సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ గోమూత్ర రాష్ట్రాలుగా పిలిచే హిందీ బెల్ట్‌ రాష్ట్రాలలోనే బీజేపీ బలంగా ఉందని ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారు. అక్కడ మాత్రమే ఆ పార్టీ గెలవగలదు’’ అన్నారు.అలాగే ‘‘విూరు దక్షిణ భారతంలో అడుగుపెట్టలేరు. మేం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటకలలో బలంగా ఉన్నాం. అందుకే విూరు వీటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి విూరు పరోక్షంగా అధికారం చెలాయించినా మేమేవిూ ఆశ్చర్యపోము. ఎందుకంటే కలలలో కూడా విూరు దక్షిణాది రాష్ట్రాలలో అధికారంలోకి రాలేరు’’ అన్నారు.జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) చట్టం, జమ్మ కశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సెంథిల్‌ కుమార్‌పై విధంగా మాట్లాడారు.అయితే అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ కూడా సెంథిల్‌ వ్యాఖ్యలను ఖండాంచాయి. డీఎంకే కూడా సెంథిల్‌ వ్యాఖ్యలకు దూరంగా ఉంది. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై స్పందిస్తూ ‘‘ ఉత్తర భారతం వారిని పానీపూరి అమ్మేవారుగానూ, టాయిలెట్లు కట్టేవారంటూ విమర్శ చేసిన డీఎంకే ఎంపీ ‘ఇండి కూటమి’లో భాగస్వామి అయిన ఎంపీ గోమూత్రం గురించి పరిహసిస్తున్నారు’’ అన్నారు.అయితే సెంథిల్‌ కుమార్‌ పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. కానీ బీజేపీ ఈ వ్యాఖ్యలపై ఇంకా కోపంగానే ఉంది. కేంద్రమంత్రి విూనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలు ‘సనాతన సంప్రదాయాన్ని, సనాతన వాదులను’ అవమానించడమేనన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *