తల్లి సహాయంతో ఆరు హత్యలు
హంతకుడు ప్రశాంత్‌ గురించి విూడియాకు వెల్లడిరచిన ఎస్పీ
కామారెడ్డి డిసెంబర్‌ 19: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ విూడియా ముందు ప్రవేశ పెట్టారు.ఎస్పీ పేర్కొన్న వివరాల మేరకు? ఆర్థిక లావాదేవీలతోనే వరుస హత్యలను నిందితుడు చేసినట్లుగా పేర్కొన్నారు. గతంలో తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్‌ ను నమ్మబలికి తన ఆస్తులను సైతం కాజేసేందుకు హంతకుడు ప్రశాంత్‌ కుట్రలకు దిగినట్లుగా తెలిపారు. ప్రసాద్‌ ఆస్తులను తన పేరిట బదలాయించుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని హతం చేస్తే అడిగే వారుండరని భావించి తన తల్లి ఒడ్డెమ్మ సహాయంతో ఇదంతా చేసినట్లుగా ఎస్పీ సింధూ శర్మ చెప్పారు.నవంబర్‌ 29న మొదటగా ప్రసాద్‌ను, ఆ తర్వాత డిసెంబర్‌ 1న ప్రసాద్‌ భార్య శాన్వికను బాసర బ్రిడ్జీలో వేసి, చెల్లెలు శ్రావణిని చేగుంట వద్ద పెట్రోల్‌ పోసి కాల్చి చంపారు. డిసెంబర్‌ 8న ప్రసాద్‌ ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసి సోన్‌ బ్రిడ్జి వద్ద పడేశారు. డిసెంబర్‌ 13న ప్రసాద్‌ మరో చెల్లెలు స్వప్నను గాంధారి వెళ్లే దారిలో భూంపల్లిలో పెట్రోల్‌ పోసి కాల్చేశారు. చివరగా ప్రసాద్‌ తల్లిని చంపేసే ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటుగా ఒక మైనర్‌ బాలుడు, మరో ఇద్దరు నిందితులు బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్టు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *