హైదరాబాద్‌: పౌర సరఫరాల శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్‌ చేసే శాఖ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం అయన పౌర సరఫరా శాఖపై సవిూక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్‌ 500, ప్యాడి ప్రోక్యూర్మెంట్‌ లో 500 పెంచేది వంద రోజుల్లో అమలు చేస్తామని అన్నారు.
క్వాలిటీ రేషన్‌ సప్లై.. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బిఆర్‌ఎస్‌ ఉచితంగా ఇచ్చింది. లబ్ధిదారుల నుంచి పీడీఎస్‌ రైస్‌ డైవర్ట్‌ అయ్యిందని అన్నారు. లబ్ధిదారులకు తినగలిగే రైస్‌ ఇవ్వాలి. కమిషనర్‌ మళ్ళీ సవిూక్ష చేయాలి. 2కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రోక్యూర్మెంట్‌ కు సివిల్‌ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బులు వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఈ శాఖకు ఆర్థిక శాఖకు సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ 90 లక్షల మెట్రిక్‌ టన్నులు
18వేల కోట్ల విలువైన ప్యాడి రైస్‌ మిల్లర్ల వద్ద ఉంది. దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్‌ లో చర్చిస్తాం. 1.17లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సివిల్‌ సప్లై వద్ద ఉందని అన్నారు.
11వేల కోట్ల నష్టాల్లో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ఉంది. తొమ్మిదిన్నర ఏళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో లోపాలు ఉన్నాయి. ఉన్న రేషన్‌ కార్డులో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటిపోలేదు. కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ ఉంది. సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్తా. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *