పోరాటాలతో త్యాగాల పునాది విూద ఏర్పడిన తెలంగాణ
అమరవీరుల ఆకాంక్షను నెరవేరుస్తాం
తెలంగాణ సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం
ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టాము
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం
శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్
మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం
కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా’’
ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగంలో రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 7: ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని.. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావచ్చు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ తొలిసారి ప్రసంగించారు.‘‘పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. త్యాగాల పునాది విూద తెలంగాణ ఏర్పడిరది. తెలంగాణ సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. అమరవీరుల ఆకాంక్షను నెరవేరుస్తాం. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను బద్దలు కొట్టాం. ప్రగతిభవన్‌కు ఇక అందరూ వెళ్లొచ్చు. తెలంగాణ ప్రజలు నా విూద ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం. ప్రతీ కార్యకర్త కష్టాన్ని గుర్తు పెట్టుకుంటా. కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా’’ అంటూ హావిూ ఇస్తూ.. జై కాంగ్రెస్, జై జై సోనియమ్మ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా.. ఎల్బీస్టేడియంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏఐసీసీ అగ్రనేతలు హాజరయ్యారు.