హైదరాబాద్ డిసెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గడ్డం విజయం సాధించారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. 2012లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో టెక్స్‌టైల్స్ మంత్రిగా పని చేశారు.