హైదరాబాద్ డిసెంబర్ 6: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నరేంద్రమోదీ ప్రభుత్వం ఆచరిస్తోందని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతిసందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియాలో మోదీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకుందన్నారు. అంబేద్కర్ గొప్ప నాయకుడు, నేర్పరి అంటూ కొనియాడారు.అంబేద్కర్ అంటేవ్యక్తిగతంగా తనకు చాలా గౌరవం అని, ఆయన రాజ్యాంగం గురించి తెలిసెందుకు ప్రధాని మోదీ భీమ్ యాప్‌ను ప్రారంభించారని గవర్నర్ తమిళి సై అన్నారు. ఏ దేశంలో అయితే మహిళల అభివృద్ధిజరుగుతుందో… ఆ దేశం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ అన్నారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని తమిళి సై సూచించారు.