అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం డిసెంబర్‌ 1 న మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ,పార్టీ పిఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు పాల్గోంటారు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన, టీడీపీ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితాలు పరిశీలన తదితర విషయాలపై చర్చ జరగనుందని సమాచారంజ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *