కడప, నవంబర్‌ 24: ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా పైన ఫోకస్‌ చేసిన ఎన్నికల సంఘం..తాజాగా ఎన్నికల విధుల ఖరారు పైన చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు కేటగిరీలవారీగా పంపాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మోడల్‌ స్కూళ్లలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు సహా అందరి వివరాలూ ఇవ్వాలని స్పష్టం చేశారు.టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదంటూ గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి అదనపు సిబ్బంది అవసరమైతే… అన్ని శాఖల ఉద్యోగులను వినియోగించిన అనంతరం అవసరమైతే మాత్రమే టీచర్ల సేవలు వాడుకోవాలని స్పష్టంచేసింది. దీంతో, ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొన కూడదని పేర్కొనలేదు. ఇక, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ విూనా తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాల్లోని అన్నిశాఖల వివరాలు, కేటగిరీల వారీగా పంపాలని కోరినట్లు సమాచారం.వీటిపైన జిల్లా కలెక్టర్లు ఆయాశాఖల అధికారులను అప్రమత్తం చేశారు. అన్నిశాఖల అధికారులతోపాటు ఎన్నికల సంఘం ఆదేశాలతో విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలు కేటగిరీలవారీగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్‌ అధికారులుగా విధుల్లోకి తీసుకోవడంపై సంసిద్ధత జాబితాను సిద్ధం చేయాలంటూ ఎంఈవోలను కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు క్యాడర్‌వైజ్‌గా డిసెంబరు 25లోపు జిల్లా కలెక్టర్‌కు పంపాలని జిల్లా ప్రజాపరిషత్‌, మున్సిపల్‌, మోడల్‌ స్కూల్‌, ఇతర పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.ఎన్నికల సంఘం నిర్ణయం:ఎన్నికల విధుల నుంచి ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలంటే ఎన్నికల కమిషనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల నుంచి ఎంత మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు….ఎంతమంది ఎన్నికల విధులకు అవసరం అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలా వద్దా అనేది ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తుంది. అంటే ఎన్నికల విధుల్లో ఎంత మంది సిబ్బంది అవసరం, ఏఏ క్యాడర్‌ ఉద్యోగులు అవసరం, ఏఏ క్యాడర్‌ ఉద్యోగులకు ఏఏ విధులు కేటాయించాలి వంటి అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయం. దీంతో, ఇప్పుడు ఎన్నికల్లో విధుల పైన ఉపాధ్యాయుల సంసిద్దత తీసుకోవాలని మెమోలో సూచించటంతో విధుల కేటాయింపుపైన చర్చ మొదలైంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *