రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. నవంబర్ 25న ఎన్నికలు జరగనుండటంతో.. అగ్రనేతలు బరిలోకి దిగారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం, వెనుకబడిన కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పిలుపునిస్తూ మండల రాజకీయాలతో బిజెపి హిందూత్వ రాజకీయాల్ని ఎదుర్కోవడానికి బీజేపీయేతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కులాల సర్వేను ప్రకటించారు. దీంతో బీజేపీ ఇప్పుడు వీటిని కౌంటర్ చేసేందుకు పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన రాజ్ పుత్ లు, బ్రాహ్మణులు, బనియాల్ని తిరిగి నమ్ముకుంటోంది. అదే సమయంలో వెనుక బడిన వర్గాల్ని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఈసారి బీజేపీ ఏకంగా 60 మంది ఓబీసీ అభ్యర్ధులకు అవకాశం ఇచ్చింది. అంటే దాదాపు 30 శాతం మందికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే రాజస్థాన్‌లో అత్యంత ఆధిపత్య ఓబీసీ వర్గంగా ఉన్న జాట్ సామాజికవర్గానికి చెందిన బీజేపీ నేతలకు 31 టిక్కెట్లు లభించాయి. ఇతర చిన్న ఓబీసీ గ్రూపులైన యాదవ్, కుమావత్, బిష్ణోయ్, సైనీ, పటేల్, నగర్, రావణ రాజ్‌పుత్, ధకడ్‌లకు 29 టిక్కెట్లు లభించాయి. అలాగే ఎంబీసీ కేటగిరీలో అత్యధిక ప్రాబల్యం ఉన్న గుజ్జర్ వర్గానికి 10 టిక్కెట్లు ఇచ్చారు. దీతో ఈసారి బీసీ వర్గాలకు బీజేపీ 70 సీట్లు అంటే 35 శాతం ఇచ్చినట్లయింది. అలాగే 35 మంది ఎస్సీలకు ఈసారి టికెట్లు ఇచ్చింది. ఇందులో 34 రిజర్వుడు సీట్లు కాగా.. ఓ అభ్యర్ధికి జనరల్ సీటులోనూ అవకాశం ఇచ్చింది. దీంతో బిజెపి అభ్యర్థుల జాబితాలో ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థులు 17.5 శాతం ఉన్నారు. అలాగే 29 మంది ఎస్టీ అభ్యర్ధులకు సీట్లు ఇచ్చింది. వీరిలో నలుగురు అన్‌రిజర్వ్‌డ్ స్థానాల నుండి, మిగిలినవారు రిజర్వుడు సీట్ల నుంచి పోటీ చేస్తున్నారుఅయితే.. కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ర్యాలీలతో హోరాహోరీ ప్రచారం కొనసాగుతోంది. నవంబర్ 25న ఎన్నికలు జరగనుండటంతో.. బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలోకి అగ్రనేతలు దిగారు. ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హావిూలు కురిపిస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా.. పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నాయి పార్టీలు..రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హావిూ ఇచ్చింది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా, తాజాగా కులగణనను మేనిఫెస్టోలో చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు కులగణన ప్రస్తావన తీసుకొచ్చారు. అధికారంలోకి వస్తే తాము దేశవ్యాప్తంగా ఖచ్చితంగా కులాల వారీగా గణన చేపడతామన్నారు. తాజాగా ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది.కులాల పరంగా ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్న రాజస్థాన్‌లో ఓబీసీ ఓటర్లే కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రధాన ఓటు బ్యాంక్..! దీంతో ఆ దిశగానే ఇరు పార్టీలు పాచికలు కదుపుతూ, తమదైన వ్యూహంతో ప్రచార ర్యాలీలు నిర్వహిస్తూ హావిూలు కురిస్తున్నాయి. రాజస్థాన్‌లోని కోటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. దోపిడీదారులు, నేరస్తుల కబంద హస్తాల నుంచి రాజస్థాన్‌ను రక్షించాలన్నా ఆయన, అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు.రాజస్థాన్‌లోని జాలోర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఈ వివాదాస్పద కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాని మోదీయే కారణమన్నారు రాహుల్‌గాంధీ. గెలుపు ముంగిట ఉన్న జట్టు మోదీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఓడిపోయిందన్నారు. మోదీ ఓ చెడు శకునం అన్నారు రాహుల్‌గాంధీ.మరోవైపు, కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా పార్టీల వ్యూహాలు రచిస్తున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలో సుమారు 30% వరకు ఓబీసీ వర్గానికి చెందిన వారే. ఇక్కడ జాట్‌లే ఆధిపత్య ఓబీసీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు 17.8%, షెడ్యూల్డ్ గిరిజన తెగలు 13.5% ఉండగా, ఓబీసీ ఎంతమంది ఉన్నారనేది సంఖ్యాపరంగా కచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ? సుమారు 30 నుంచి 40% దాక ఉంటారనే అంచనా. జేపీ మొత్తం అభ్యర్ధుల్లో ఎస్టీలకు 14.5 శాతం సీట్లు ఇచ్చినట్లయింది. అలాగే అగ్రవర్ణాల్లో 27 మంది రాజ్‌పుత్ అభ్యర్థులకు, 19 మంది బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చింది. వ్యాపారులు, ఇతర వర్గాల నుండి 17 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఇందులో జైన్, సింధీ, రాజ్‌పురోహిత్, పంజాబీ వంటి వారు ఉన్నారు. దీంతో మొత్తం 200 మంది అభ్యర్ధుల్లో 63 మంది అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చినట్లయింది. దీంతో వీరి శాతం 31.5 శాతంగా ఉంది. అయితే ముస్లింలకు మాత్రం ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు.వీటన్నింటిని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దృష్టిలో ఉంచుకునే, ఓబీసీలకు కాంగ్రెస్ 72, బీజేపీ 70 టిక్కెట్లు కేటాయించింది.మొత్తానికి ఈ ఎన్నికల్లో బీజేపీ`కాంగ్రెస్ పార్టీల్లో? ఎవరి ఎత్తుగడ, హావిూలకు ఓటర్లు మొగ్గు చూపుతారో చూడాలి..!