విశాఖపట్టణం, నవంబర్‌ 21: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిలిచింది.. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది.. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే అనుమానం స్థానికుల్లో రేకెత్తుతోంది. ఓ యూట్యూబర్‌ సముద్రంలో చేపల వేట గురించి స్టోరీ చేసేందుకు వీడియో చిత్రీకరించారు. ఆ తరువాత అక్కడ కొంతమంది ఆకతాయిలతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ యూట్యూబర్‌ విదేశీ మద్యంతో పార్టీ చేసుకున్నారు. ఇక మద్యం మత్తులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని.. ఈ క్రమంలో ఓ రెండు పార్టీల గురించి చర్చించుకున్న సందర్భంలో మద్యం పార్టీలో గొడవకు బీజం పడిరది. అప్పటికే వారు ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతన్నారో తెలియని పరిస్థితిలో రాడ్లు, కర్రలతో మద్యం మత్తులో కొట్టుకున్నారు. ఈ గొడవలో ఫిషింగ్‌ హార్బర్‌లో తల్వార్లు ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులో రెండు వర్గాలుగా విడిపోయున ఆకతాయలు రెచ్చిపోయారు. ఓ వర్గానికి చెందిన వారిని కొంతమంది రెచ్చగొట్టారా.. అన్న సందేహం కలుగుతుంది. యూట్యూబర్‌ వీడియో రికార్డ్‌ చేసుకొని రావాల్సింది పోయి.. మత్స్యకారులకు విదేశీ మద్యంతో పార్టీ ఇవ్వడం వెనుక కుట్ర కోణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారని సమాచారం అందుతోంది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి.. రూ. 40 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.. ఎవరో ఆకతాయిలు చేసిన పని… వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది.. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ళ ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. అగ్నిప్రమాదం జరగగానికి ఓ మందు పార్టీనే.. ఆ తర్వాత జరిగిన ఘర్షణే కారణంగా తెలుస్తోంది.. ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంపై విశాఖ జేసీ విశ్వనాథం తెలిపిన వివరాలు ప్రకారం … కొంతమంది యువకులు మద్యం మత్తులో ఫిషింగ్‌ హార్బర్‌లో హంగామా సృష్టించారని తెలిపారు.. అర్ధరాత్రి మద్యం తాగి గొడవ పడి బోటుకు నిప్పంటించారు.. కొంతమంది యువకుల విూద అనుమానం ఉందన్నారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. వారే అని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు.. ఈ ప్రమాదంలో సుమారు 35 నుండి 40 బోట్లు దగ్ధమయ్యాయి.. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది అంచనా వేస్తున్నామని జేసీ విశ్వనాథం తెలిపారు. అగ్ని ప్రమాదం ఘటనలో యూట్యూబర్‌ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *