సేవాలోపానికి గాను నష్టపోయిన బాధితురాలికి రూ.2.13 లక్షల జరిమానా చెల్లించాలని తపాలా శాఖను ఆదేశిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన బాధితురాలు అనుమకొండ వెంకట రత్నమ్మ ఏడాదికి 7.7 శాతం వడ్డీతో కూడిన 5 ఏళ్ల ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా తెరవడానికి 2020 మార్చి 20న పోస్టల్ ఏజెంట్ కు రూ.30 లక్షలకు చెక్, డాక్యుమెంట్లను ఇచ్చింది. అదే రోజు ఖాతా తెరుస్తానని ఏజెంట్ హామీ ఇచ్చి చెక్ ను కావలి పోస్ట్ మాస్టర్ కు అందజేశాడు. ఖాతా గురించి ఏ సమాచారం తెలియకపోవడంతో 2020 ఏప్రిల్ 2న బాధితురాలు ఆన్లైన్ లో తపాలా శాఖకు సంబంధించిన వెబ్సైట్ లో ఫిర్యాదు చేసింది. తపాలా శాఖ ఆత్మకూరు సూపరింటెండెంట్ ఆదేశాలతో పోస్టుమాస్టర్ ఏప్రిల్ 28న బాధితురాలి ఫిర్యాదుకు జవాబు ఇచ్చాడు. డాక్యుమెంట్ల ధృవీకరణ తరువాత 2020 మార్చి 30న చెక్ ను పోస్ట్ మాస్టర్ స్టేట్ బ్యాంక్ కు పంపాడని, 2020 ఏప్రిల్ 2న చెక్ డబ్బు మొత్తం పోస్ట్ మాస్టర్ అకౌంట్ కు జమ చేయబడిందన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి వడ్డీ శాతాన్ని 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించిందని.. ఏప్రిల్ 2వ తేదీన డబ్బులు జమచేయబడడంతో అదే రోజున వెంకట రత్నమ్మ పేరుతో అకౌంట్ ను తగ్గించిన వడ్డీ శాతం ప్రకారం బాధితురాలి ఖాతాను తెరిచారని జవాబు లో పేర్కొన్నారు. దీంతో బాధితురాలు చెక్ మార్చి 23వ తేదీనే అందించానని.. 7.7 శాతం వడ్డీ తోనే ఖాతా ఉండాలని అభ్యర్థించించినా తపాలా శాఖ పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. కరోనా కారణంగా రోజుకు 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావడంతో చెక్ ను ఆలస్యంగా బ్యాంక్ కు పంపించారని, ఏప్రిల్ 2వ తేదీ డబ్బులు జమకావడంతో అదే రోజున ఖాతా తెరిచామని.. తమ తప్పు లేదని తపాలా శాఖ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసును విచారించిన న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు ఇస్తూ.. ఖాతాను మార్చి 23వ తేదీన ప్రారంభించబడుతుందని తెలియజేసి తపాలా శాఖ ఏజెంట్ అవసరమైన అన్ని పత్రాలతో చెక్‌ను అదే రోజు సేకరించాడని. ఖాతాను తెరవడానికి మరియు క్లియరెన్స్ కోసం చెక్కును పంపడానికి అవసరమైన అదనపు నిబంధనలు ఉంటే దాని గురించి మార్చి 23వ తేదీనే భాడితురాలికి తెలియ చేసుండాల్సిందన్నరు. కానీ బాధితురాలు ఏప్రిల్ 20న తపాలా శాఖ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఫిర్యాదు చేసే వరకు ఖాతా స్థితిని తెలియజేయక పోవడం తపాలా శాఖ యొక్క సేవా లోపమని పేర్కొన్నారు. బాధితురాలి నష్ట పరిహారం కు గాను రూ.1,58,247 లు, మానసిక ఆవేదనకు గాను రూ.50 వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 45 రోజుల్లో చెల్లించాలని తపాలా శాఖను ఆదేశించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *