`కొచెరిల్‌ రామన్‌ నారాయణన్‌ భారతదేశ 10వ రాష్ట్రపతి. అతను ఉరaుపూర్‌ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. పాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. నెహ్రూ ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగిగా నారాయణన్‌ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణన్‌ ప్రతిభను గుర్తించిన జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆయనను రంగూన్‌ లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను జపాన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, థాయ్‌లాండ్‌, టర్కీ, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. అమెరికాలో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నాడు.
కె.ఆర్‌.నారాయణన్‌ పెరుమథనం, ఉరaవూర్‌ గ్రామంలో పేద కుటుంబంలో కొచెరిల్‌ రామన్‌ వైద్యర్‌, పున్నత్తురవీట్టిల్‌ పాపియమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి సిద్ధ, ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. అతని కుటుంబం ‘‘పరవాన్‌’’ కులానికి చెందినవారు. పేదరికంతో ఉండేది. అతని తండ్రి వైద్యం చేయడం ద్వారా గౌరవాన్ని సంపాదించాడు. నారాయణన్‌ 1921, ఫిబ్రవరి 4 న జన్మించాడు. అతని మామయ్య అతన్ని పాఠశాలలో చేర్పించేటప్పుడు పుట్టినతేదీ సరిగా తెలియక 1921 అక్టోబరు 27 గా పాఠశాల రికార్డులలో నమోదు చేయించాడు. నారాయణన్‌ తరువాత ఆ తేదీనే అధికారికంగా ఉంచుకున్నాడు.నారాయణన్‌ ప్రారంభ విద్యను ఉరaవూర్‌ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. తరువాత అవర్‌ లేడీ అఫ్‌ లౌర్డెస్‌ అప్పర్‌ ప్రైమల్‌ స్కూల్‌, ఉళవూర్‌ (1931?35) లో చదివాడు. తన యింటి నుండి 15 కిలోవిూటర్ల దూరంలో గల పాఠశాలకు వరిపొలాల గుండా నడుచుకొని వెళ్ళేవాడు. పాఠశాల విద్యకు ఫీజులు చెల్లించలేక పోయేవాడు. తరచుగా తరగతిగది వెలుపల నిలబడి పాఠాలు నేర్చుకునేవాడు. ట్యూషన్‌ ఫీజులు అధికంగా ఉండటం వల్ల తరగతి గదిలోనికి అతని హాజరును నిషేధించారు. ఆ కుటుంబం పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక యిబ్బందులు పడేది. అతని అన్నయ్య కె.ఆర్‌. నీలకంఠన్‌ ఆస్త్మా రోగం వల్ల బాధపడుతూ గృహానికి పరిమితమయ్యాడు. నీలకంఠన్‌ ఇతర విద్యార్థుల నుండి పుస్తకాలను తీసుకొని, వాటిని నకలు చేసి, వాటిని నారాయణ్‌కి ఇచ్చేవాడు. నారాయణన్‌ సెయింట్‌ మేరీ హైస్కూలు, కురవిలంగడ్‌ లో (అంతకు ముందు 1935?36 లో సెయింట్‌ జాన్స్‌ హైస్కూలు కూతట్టుకుళంలో చదివాడు) మెట్రిక్యులేషన్‌ (1936?37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్‌ విద్యను కొట్టయం లోని సి.ఎం.ఎస్‌ కళాశాలలో (1938?40) పూర్తిచేసాడు. ట్రావెన్స్‌కోర్‌ రాజ కుటుంబం నుండి ఉపకార వేతనాన్నిపొందాడు. నారాయణన్‌ బి.ఎ (ఆనర్స్‌), ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్‌ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం) నుండిపూర్తిచేసాడు. విశ్వవిద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్‌ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. అతని కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అతను ఢల్లీి వెళ్ళి ది హిందూ, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలలో పాత్రికేయుడిగా (1944?45) పనిచేసాడు. ఆ కాలంలో అతను తన స్వంత సంకల్పంతో 1945 ఏప్రిల్‌ 10న బొంబాయిలో మహాత్మా గాంధీని ఇంటర్వ్యూ చేసాడు .1945లో నారాయణన్‌ లండన్‌ వెళ్ళి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ వద్ద హారోల్డ్‌ లాస్కీ అధ్యర్యంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. అతను కార్ల్‌ పాప్పర్‌, లియోనెల్‌ రోబిన్స్‌, ఫ్రెడిరిచ్‌ హైక్‌ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. జె.ఆర్‌.డి.టాటా అందించిన ఉపకార వేతనంతో రాజనీతి శాస్త్రం ప్రత్యేకాంశంగా బి.ఎస్‌.సి (ఆర్థిక శాస్త్‌ం) డిగ్రీ ఆనర్స్‌ ను పూర్తిచేసాడు. లండన్‌ లో ఉన్నప్పుడు అతను కె.ఎన్‌.రాజ్‌ అనే సహ విద్యార్థితో వి.కె.కృష్ణవిూనన్‌ అధ్వర్యంలోని ఇండియా లీగ్‌ లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు.
కె.ఎం.మున్షీ ప్రచురిస్తున్న సోషల్‌ వెల్ఫేర్‌ వారపత్రికకు అతను లండన్‌ విలేకరిగా వ్యవహరించాడు. కె.ఎన్‌.రాజ్‌, వీరసామి రింగాడూ (తరువాత కాలంలో మలేషియా మొదటి అధ్యక్షుడు) లతో కలసి ఒకే గదిలో ఉండేవాడు. అతనికి మరొక ఆప్త మిత్రుడు పియరీ త్రుదే (తరువాత కాలంలో కెనడా ప్రధానమంత్రి).అతను రంగూన్‌, బర్మా (మయన్మార్‌) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్‌ టింట్‌ ను కలిసాడు. తరువాత 1951 జూన్‌ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్‌ టింట్‌ ‘‘ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్‌ అసోసియేషన్‌’’ లో క్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కీ విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్‌ ఐ.ఎఫ్‌.ఎస్‌, ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం నెహ్రూ నుండి ప్రత్యేక మినహాయింపు అవసరమైంది. మా టింట్‌ టింట్‌ భారతీయ నామం ‘‘ఉషా’’ గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. ఉషా నారాయణన్‌ మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢల్లీి స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ లో మాస్టర్‌ డిగ్రీని చేసింది. ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్‌ పీ మైంట్‌ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం ‘‘స్వీట్‌ అండ్‌ సోర్‌’’ అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపథ్యం గల వారిలో భారతదేశంలో ‘‘ప్రథమ మహిళ’’గా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడిరది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్‌ (స్విడ్జర్లాండ్‌, ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్‌), అమృత. ఇందిరా గాంధీ అభ్యర్థన మేరకు అతను రాజకీయాలలోనికి ప్రవేశించాడు. 1984, 1989, 1991 లలో వరుసగా మూడు సార్లు పాలక్కాడ్‌ (కేరళ) లోని ఒట్టపాళం నియోజకగర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొంది లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను రాజీవ్‌ గాంధీ కేబినెట్‌ లో రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 1985 లో ప్లానింగ్‌ , 1985`86 మధ్య విదేశీ వ్యవహారాలు, 1986`89 మధ్య సైన్సు అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పదవులను స్వీకరించాడు. పార్లమెంటు సభ్యునిగా అతను అతను భారతదేశంలో పేటెంట్‌ నియంత్రణలను అణచడానికి అంతర్జాతీయ ఒత్తిడిని అడ్డుకున్నాడు. 1989 నుండి 1991 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పదవిలో లేనందువల్ల ప్రతిపక్షంలో ఉన్నాడు. 1991లో కాంగ్రెస్‌ మరలా అధికారంలోనికి వచ్చిన తరువాత అతనికి ఏ కేబినెట్‌ పదవీ దక్కలేదు. అతనికి రాజకీయ విరోధి అయిన అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌, కమ్యూనిస్టు భావజాలం కలిగి యున్నందున నారాయణన్‌ మంత్రి అయ్యే అవకాశం లేదని తెలిపాడు. అయితే, తాను మూడు ఎన్నికలలో కమ్యూనిస్ట్‌ అభ్యర్ధులను ఓడిరచినట్లు నారాయణన్‌ స్పష్టం చేశాడు.
1992 ఆగస్టు 21 న నారాయణన్‌ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్‌ పేరును మొదటి సారిగా జనతాదళ్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి వి.పి.సింగ్‌ ప్రతిపాదించాడు. జనతాదళ్‌ , పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది తరువాత పి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుండి మద్దతు పొందింది. ఇది అతని ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. కె.ఆర్‌. నారాయణన్‌ 1997 జూలై 17 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకయ్యాడు. రాష్ట్రపతి ఎన్నికలలో అతనికి 95% ఎలక్టోరల్‌ కాలేజి ఓట్లు వచ్చినవి. ఈ ఎన్నికలు జూలై 14న జరిగింది. కేంద్రంలో మైనారిటీప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఏకైక అద్యక్షుని ఎన్నిక ఇది. అతనిని టి. ఎన్‌. శేషన్‌ ఏకైక ప్రత్యర్థి అభ్యర్థి. శివసేన తప్ప మిగతా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ నారాయణన్‌కు ఈ అధ్యక్ష ఎన్నికలలో మద్దతు నిచ్చాయి. నారాయణన్‌ కేవలం దళిత అభ్యర్థిగా ఎన్నికయ్యారని శేషన్‌ ఆరోపించాడు.1997 జూలై 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్‌.వర్మ సమక్షంలో పార్లమెంటు సెంట్రల్‌ హాలులో దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసాడు.1998 సార్వత్రిక ఎన్నికలలో నారాయణన్‌ రాష్ట్రపతి భవన్‌ సముదాయం లోని ఒక పాఠశాలలో నిర్వహింపబడుతున్న పోలింగు బూత్‌లో సామాన్య ఓటర్లతో కలసి వరుసలో నిలబడి ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా గుర్తింపబడ్డాడు. ఈ ప్రక్రియను తన పూర్వపు రాష్ట్రపతులు వదిలి వేసినప్పటికి అతను ఓటు వేయడానికి పట్టుబట్టాడు. 1999 సార్వత్రిక ఎన్నికలలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.అధ్యక్షుడు నారాయణన్‌ ఒక రాష్ట్రంలో రాజ్యాంగంలోని 356 అధికరణ క్రింద రాష్ట్రపతి పాలనను విధించేందుకు కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసును పునఃపరిశీలించమని రెండు సార్లు కోరాడుÑ గుజ్రాల్‌ ప్రభుత్వం (1997 అక్టోబరు 22) ఉత్తర ప్రదేశ్‌ లోని కళ్యాణ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు, వాయ్‌పేయి ప్రభుత్వం (1998 సెప్టెంబరు 25) న బీహార్‌ లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు అతను ఈ విధంగా పునః పరిశీలను కోరాడు. ఈ రెండు సందర్భాలలో అతను నిర్ణయం తీసుకున్నప్పుడు 1994 లో జరిగిన ఎస్‌.ఆర్‌.బొమ్మై, కేంద్ర ప్రభుత్వం పై సుప్రీ కోర్డు ఇచ్చిన తీర్పును ఉదహరించాడు. రాష్ట్రపతి సూచనను మంత్రివర్గం గౌరవించింది. ఒక అధ్యక్షుడు ఇటువంటి పునఃపరిశీలనను కోరినప్పుడు, ఈ సంఘటనలు ఫెడరలిజం, రాష్ట్రప్రభుత్వాల అధికారాలను గూర్చి ముఖ్యమైన సంప్రదాయాన్ని నెలకొల్పింది. భారత రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తరువాత కె.ఆర్‌. నారాయణన్‌ తన భార్య ఉషతో పాటు తన మిగిలిన జీవితాన్ని సెంట్రల్‌ ఢల్లీి బంగ్లా (34 ఫృధ్వీ రోడ్‌) లో గడిపాడు. ముంబై (21 జనవరి 2004) లో వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ ‘‘ప్రత్యామ్నాయ ప్రపంచీకరణ ఉద్యమానికి’’ తన మద్దతును అందించాడు.అతను సిద్ధ, ఆయుర్వేదం కోసం నవజ్యోతిశ్రీ కరుణాకర గురు పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి ఉరaావూరు నుండి పోథెన్‌కోడ్‌ లోని సంతిగిరి ఆశ్రమానికి వెళ్ళాడు. కె.ఆర్‌.నారాయణన్‌ 2005 నవంబరు 9 న తన 85వ యేట న్యూఢల్లీి లో మరణించాడు. అతనికి హిందూ ధర్మ శాస్త్రంప్రకారం దహన కార్యక్రమాలను సైనిక లాంఛనాలతో చేసారు. ఇది రాజ్‌ఘాట్‌ కు సవిూపంలోని ‘‘కర్మ భూమి’’ లో జరిగింది. కె.ఆర్‌.నారాయణన్‌ ఫౌండేషన్‌ 2005లో స్థాపించబడినది. ఇది కె.ఆర్‌.నారాయణణ్‌ జ్ఞాపకార్థం అతని ఆదర్శాలను ప్రచారం చేయుటకు ప్రారంభించబడిరది. దీని లక్ష్యం కేరళ సమాజంలోని దుర్బల వర్గాలైన మహిళలు, పిల్లలు, అంగవైకల్య వ్యక్తులు, వృద్ధులు, ఇతర వెనుకబడిన వర్గాలకు విద్యా శిక్షణను అందిచడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వారిజీవన పరిస్థితులను మెరుగుపరచడాం, వారి కుటుంబాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలద్వారా మంచి భవిష్యత్తునందించడం.ఈ ఫౌండేషన్‌ యొక్క ముఖ్య ఉద్దేశం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *