తీవ్రతను బట్టి ఏ బి సి కేటగిరీలుగా విభజించుకుని సమస్యలను పరిష్కరించాలి…

ఆర్ డబ్ల్యూ ఎస్ జిల్లా అధికారులు తో మండలాల వారీగా త్రాగునీటి సమస్యలుపైన సమీక్షించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

నియోజక వర్గంలో నెలకొన్న త్రాగునీటి సమస్యలుపై ప్రత్యేక దృష్టి సారించాలని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్యజిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి లోని తన కార్యాలయంలోఆర్ డబ్ల్యూ ఎస్ జిల్లా అధికారులుతో నియోజక వర్గ పరిధిలోని మండలాల వారీగా త్రాగునీటి సమస్యలుపైన శ్రీకాంత్ రెడ్డి
సమీక్షించారు.గ్రామాల లోని త్రాగునీటి
తీవ్రతను బట్టి ఏ బి సి కేటగిరీలుగా విభజించుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి రూరల్ మండలం లో మాధవరం,సిబ్యాల,సంబేపల్లె మండలంలోని శెట్టిపల్లె గ్రామంలోని రఘుపతి ఇండ్లు,తాటిగుంట హరిజన వాడ,నాగిరెడ్డిగారిపల్లె, తిమ్మక్క గారిపల్లె,చిన్నమండెం మండలం లోని చాకిబండ గ్రామంలోని వరదన్నగారిపల్లె, సి పొలిమేరపల్లె తదితర గ్రామాలలో తీవ్ర త్రాగునీటి ఎద్దడి నెలకొందని,ఆ గ్రామాలలో త్రాగునీటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.వెలిగల్లు ప్రాజెక్ట్ నుంచి నీరు గాలివీడు మండలంలోని దిగువ ప్రాంతాల గ్రామాలలోని చెరువులకు, లక్కిరెడ్డిపల్లె మండలంలోని మూడు,నాలుగు గ్రామాలకు మినహా అన్ని గ్రామాలలోని చెరువులకు వెల్లుతోందన్నారు .వాటర్ గ్రిడ్ పనులుపై చర్చించారు. రోళ్లమడుగు నీటి పథకం లో భాగంగా రామాపురం బిసి కాలనీ వద్ద సంప్ ఏర్పాటు పనులును త్వరితగతిన ప్రారంభించాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన త్రాగునీటి పనులు, జె జె ఎం పనులును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.రూ 4 కోట్ల నిధులుతో చేపట్టిన చెన్నముక్క పల్లె త్రాగునీటి పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన పెండింగ్ బకాయిలు ఎంతమేర ఉన్నాయని అధికారులును అడగ్గా రూ 4.20 కోట్ల మేర ఉన్నాయని ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ తెలిపారు.సదరు బిల్లుల చెల్లింపులుకు కృషి చేయాలని అధికారులకు ఎంఎల్ఏ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ప్రసన్నకుమార్,డిఈ లు శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,అన్ని మండలాల ఏఈ లతో పాటు మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జెడ్ పీటిసి మాసన వెంకట రమణ,
స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, తొగట వీర క్షత్రియ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయ ప్రసాద్, సింగల్ విండో అధ్యక్షుడు యర్రమ రెడ్డి, బిసి నాయకుడు పాలెం రామచంద్ర, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *