విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా వున్నప్పటికీ.. చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు వున్నాయని సీతా రామ్ వెల్లడిరచారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంకి సం బంధించి చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని.. ఆయన మొదటి నుంచి స్కాంల వ్యక్తేనని స్పీకర్ వ్యా ఖ్యానించారు.జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి.. ఆయ నను 16 నెలలు జైల్లో వేశారని.. ఏం తేల్చగలిగారని, సీబీఐనే చేతులు ఎత్తేసిందని సీతారాం గుర్తుచేశారు. నారా భువనేశ్వరి అన్నట్లుగా నిజమే గెలవాలని.. స్టేలు వెకేట్ చేసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. నిజమే గెలిస్తే చంద్రబాబు జీవితకాలం జైల్లో వుండా లని స్పీకర్ తమ్మినేని అన్నారు.చంద్రబాబు తన నిర్దో షిత్వాన్ని రుజువు చేసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబుపై వన్ బై వన్ కేసులు వున్నాయని.. ఆయ నను జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని, కేంద్ర ప్రభుత్వా నికి చెందిన సీబీఐ, ఈడీ, జీఎస్టీ, సెబీ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తమ్మినేని సీతారామ్ తెలిపా రు.