హైదరాబాద్‌, అక్టోబరు 28: తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తులపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కిషన్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ ఢల్లీి వెళ్లి అమిత్‌ షాతో అర గంట సేపు చర్చలు జరిపినా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు కేటాయిస్తారు.. ఏఏ సీట్లు ఇస్తారన్నదానిపై రెండు పార్టీల మధ్య అసలు సంప్రదింపులు జరగడం లేదు. మరో వైపు తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ పెళ్లి ఇటలీలో జరుగుతూండటంతో కుటుంబసమేతంగా పవన్‌ కల్యాణ్‌ ఆ పెళ్లి కోసం ఇటలీ వెళ్లిపోయారు. ఈ ఫోటోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యాయి. పెళ్లి కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఒకటో తేదీన పెళ్లి జరుగుతుంది. రెండో తేదీన పవన్‌ కల్యాణ్‌ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబంతో కొన్నాళ్లు అక్కడే గడుపుతారో తిరిగి వస్తారో స్పష్టత లేదు. కానీ మూడో తేదీ నుంచి తెలంగాణలో నామినేషన్లు ప్రారంభమవుతాయి. అప్పటికే పొత్తులు ఉంటే.. ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో పొత్తులు అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సీట్ల సర్దుబాటు కోసం జరిపే చర్చలు రోజుల తరబడి సాగుతాయి. మరో వైపు నామినేషన్ల గడువు ముంచుకొస్తున్న సమయంలో ఎలాంటి సీట్ల చర్చలు ఇంకా జనసేన, బీజేపీ ప్రారంభించలేదు. పవన్‌ కల్యాణ్‌ మాత్రం తమ పార్టీ పోటీ చేసే స్థానాలను ఇప్పటికే ప్రకటించారు. 32 స్థానాల జాబితాను వెల్లడిరచారు. జనసేన తెలంగాణ ఇంచార్జ్‌ మహేందర్‌ రెడ్డి అభ్యర్థులను కూడా ఫైనల్‌ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో వారు పోటీ చేయడం ఖాయం. అయితే పొత్తుల కోసం బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చినందున.. అభ్యర్థుల ప్రకటనను ఇంకా ఫైనల్‌ చేయలేదని చెబుతున్నారు. మొత్తంగా జనసేన పోటీ, పొత్తులపై నామినేషన్ల గడువు ప్రారంభమైన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *