ఏలూరు: మేరీ మిట్టి మేరీ దేష్‌ కార్యక్రమంలో భాగంగా అమృత కలశ యాత్ర ను ఏలూరు జిల్లా నుండి శనివారం 29 మంది వాలంటీర్లతో దేశ రాజధాని ఢల్లీి పయనమైనట్టు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు. ఈ సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్‌ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వతంత్రం కోసం పోరాడిన అమర వీరుల త్యాగాలను, స్ఫూర్తిని స్మరించుకుంటూ భావి తరాల వారిలో దేశభక్తి పెంపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నందుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమమే మేరీ మట్టి మేరీ దేష్‌ అన్నారు. జిల్లా లో 547 గ్రామ పంచాయతీల నుండి సేకరించిన మట్టితో మండలాల వారీగా ఏర్పాటు చేసిన కలశతో విజయవాడ నుంచి ప్రత్యేక ట్రైనులో వాలంటీర్లు ఈ నెల అక్టోబర్‌ 29న ఢల్లీి చేరుకొనున్నారని అన్నారు. ఢల్లీిలో ఈ నెల అక్టోబర్‌ 30, 31 న దేశభక్తిని చాటుతూ రెండు రోజులు జరిగే కార్యక్రమాలలో మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అనేక మంది వాలంటీర్స్‌ అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టి కలశలతో పాల్గొననున్నారని విశ్వనాధ్‌ చెప్పారు. దానిలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా నుంచి 36 మంది మేరీ మిట్టి మేరీ దేష్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢల్లీి బయలు దేరారని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు. కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా జిల్లా యువజన అధికారి కిషోర్‌, సెట్వెల్‌ సీఈఓ మహారాజ్‌ వ్యవహరించగా అమృత కలశ యాత్రలో డిపిఆర్సీ, సెట్వెల్‌, యువజన కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్‌, జిల్లా పంచాయతీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *