విజయవాడ, అక్టోబరు27: ఏపీలో భారీ లిక్కర్‌ స్కాం జరుగుతోదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఓ సారి హోంమంత్రి అమిత్‌ షాకు..రెండు సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనల సమయంలో లిక్కర్‌ స్కాంపైనే దృ?ష్టి పెట్టారు. ఏపీ మద్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ఆస్పత్రులకు వెళ్లి పరామర్శించారు. డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకోకపోవడంపైనా దుకాణంలోకి వెళ్లి మరీ నిజం బయట పెట్టారు.జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టగానే మద్య నిషేధ లక్ష్యంతో నూతన మద్యం విధానం ప్రవేశపెట్టింది. ఏపీలో ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగింది. అప్పటికప్పుడు ప్రైవేటు షాపులన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు వచ్చాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్లేవిూ అమ్మడం లేదు. పూర్తిగా కొత్త బ్రాండ్లు అమ్ముతున్నారు. ఏపీలో అమ్మే మద్యం మాత్రం బయట ఎక్కడా దొరకదు. ఫల్‌ సేల్‌ ఏపీ ఓన్లీ మద్యం మాత్రమే అమ్ముతారు. ఏపీలో మద్యం తయారు చేసే డిస్టిలరీస్‌ యాజమాన్య వివరాలను పురందేశ్వరి ప్రకటించారు. ఏపీ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పోరేషన్‌లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయి. వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుంది అని తెలిపారు. 100 కంపెనీలు ఉంటే.. 16 కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యాత ఇస్తున్నారుని పురంధేశ్వరి ప్రకటించారు. అదాన్‌ డిస్టలరీస్‌ 2019లో హైదరాబాద్‌ సాగర్‌ సొసైటీ ప్లాట్‌ నెంబర్‌ 16 లో ప్రారంభించారు. ఈ అదాన్‌ కంపెనీకి రూ.1,160కోట్ల కేటాయింపు జరిగింది. చింతకాయల రాజేశ్‌, పుట్టా మహేశ్‌ కంపెనీల నుంచి కంపెనీలు లీజ్‌ కు తీసుకుని నడుపుతున్నారు. వీరిని బెదిరించి.. అదాన్‌ డిస్లరీస్‌ కంపెనీ సబ్‌ లీజ్‌కు తీసుకున్నారు. వారి నుంచి బలవంతంగా లాక్కుని బ్రాండ్‌లను తయారు చేస్తున్నారు’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపిస్తున్నారు.
ఆదాన్‌ డిస్లరీస్‌ వెనుక వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు. రూ.1863కోట్ల మద్యం ఈ డిస్లరీస్‌ నుంచి సేకరణ జరుగుతుంది అని ఆరోపించారు. ఆదాన్‌ వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి, ఎస్పీవై వెనుక ఎంపీ మిథున్‌ రెడ్డి ఉన్నారని పురందేశ్వరి ప్రకటించారు. ఆదాన్‌, ఎస్పీ వై సంస్థల అడ్రస్‌ రెండూ హైదరాబాద్‌ ఒకే చిరునామా అని పత్రాలు బయట పెట్టారు. ఎంయస్‌ బయెటెక్‌ సంస్థ తరపున అమ్మిరెడ్డి జైపాల్‌ రెడ్డి సబ్‌ లీజుకు తీసుకుని మద్యం సరఫరా చేస్తున్నారు. యన్‌.కె. డిస్లరీస్‌ తరపున రూ.1966.66కోట్ల మద్యం సరఫరా చేశారు అని పురంధేశ్వరి ఆరోపించారు. గతంలో ఎప్పుడూ వీళ్లు తయారు చేసిన కంపెనీల పేర్లే మార్కెట్‌లో లేవని చెబుతున్నారు.ప్రకాశంజిల్లాలో పాల్‌ డిస్లరీస్‌కు రూ.931.32కోట్ల మద్యానికి ఆర్డర్‌ ఇచ్చారు. సీఎం అనుచరులు బెదిరించి.. ఈ కంపెనీ లాక్కుని నడుపుతున్నారు. బి.ఆర్‌.కె స్పిరిట్స్‌ రూ.1040 కోట్ల మద్యం సేకరణ జరిగింది. శర్వాణి బేవరేజెస్‌ ను చంద్రారెడ్డి నడుపుతుండగా రూ.426.60 కోట్ల మద్యం ఆర్డర్‌ ఇచ్చారు. బిడి.యస్‌.హెచ్‌ ఆగ్రో కు రూ.328 కోట్ల మద్యం ఆర్డర్‌ ఇచ్చారు. ఈ కంపెనీల పేర్లు, యజమానుల పేర్లు చెప్పాలని కోరినా ప్రభుత్వం స్పందించ లేదు అని దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తమ బాధ్యతగా మద్యం తయారీదారులు, వారి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తామే ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. దశల వారీగా మద్యం నిషేధిస్తామన్న జగన్‌.. వారి అనుయాయులతో మద్యం తయారు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని మండిపడ్డారు. కేజీహెచ్‌ ఆస్పత్రికి వెళ్లినప్పుడు 39 మంది మద్యం వల్లే ఆస్పత్రిలో ఉన్నారని తేలిందన్నారు. ఏపీలో అటువంటి పరిస్థితి లేదని వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. మరి వైద్యులు చెబుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించదా అని దగ్గబాటి పురంధేశ్వరి నిలదీశారు. రూ. 56వేల కోట్ల ఆదాయం విూకు వస్తుంటే రూ.20వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం చెబుతుంది అని ఆరోపించారు. మరి లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కడకు వెళుతుందో జగన్‌ చెప్పాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి నిలదీశారు. ప్రభుత్వంపై పురందేశ్వరి పోరాటంలో వెనక్కి తగ్గవద్దన్న సంకేతాలు మాత్రం ఇచ్చారు. అందుకే ఆమె రోజు రోజుకు ఆరోపణల డోసు పెంచుకుంటూ పోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఆరోపణలపై దృష్టి పెట్టాయో లేదో స్పష్టత లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆమె దర్యాప్తు చేయమని అడిగితే.. ఖచ్చితంగా పరిశీలన చేస్తారు. అయితే సరైన సమయం చూసి చర్యలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. అందుకే.. ఏపీ మద్యం విధానం విషయంలో దర్యాప్తు అంటూ జరిగితే రాజకీయంగా సంచలనం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *