హైదరాబాద్‌ అక్టోబర్‌ 26:తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆయా రాజకీయ పార్టీల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ తావిూ నని గొప్పలు చెప్పుకున్న బిజెపికి ఊహించని విధంగా వరుస షాక్‌ లతో కుదేలు అవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో బిజెపి పార్టీ కి ఊపును తెచ్చిన బండి సంజయ్‌ ని పార్టీ అద్యక్షపదవి నుండి తప్పించడం మూలంగా ఎన్నికల సమయంలో బీజేపీ గ్రాఫ్‌ దారుణంగా పడిపోతుందని రాజకీయపరిశీలకులు బావిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుత పార్టీ అధ్యక్షుని వైఖరి మూలంగా కుడా పలువురు పార్టీ సీనియర్‌ నేతలు ఇప్పటికే పార్టీని వీడగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో బిజెపిలో చేరిన పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తితో, మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్న తీరు బిజెపిని ఆందోళనకు గురిచేస్తుంది. అసలే ప్రజా క్షేత్రంలో బీజేపీకి తగ్గిన పట్టు, ఆపై నేతల తీరు వెరసి బీజేపీ ఊహించని చావు దెబ్బ తింటుంది. బిజెపికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భారీ షాకిచ్చారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బాటలో బిజెపిలో అసంతృప్తితో ఉన్న కొందరు మహిళా నేతలు కూడా వెళ్లనున్నారన్నచర్చ సాగుతుంది. ఇప్పటికే గద్వాలలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు డికే అరుణ విముఖతతో ఉన్నట్లు ఆమె అనుచరులు తెలుపుతున్నారు. గద్వాలలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి బలం ఎక్కువగా ఉండడంతో, బిజెపి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి బిజెపిలో చేరిన మరో నాయకురాలు విజయశాంతి సైతం పార్టీ తీరుపై తీవ్ర విముఖత తో ఉన్నారు. పార్టీలో తనకు గుర్తింపునివ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్‌ లోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వారి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న క్రమంలో బిజెపికి నేతలు వరుస షాక్‌ లు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *