విశాఖపట్నం: విశాఖలో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు పట్టుబడడం కలకలం రేపుతోంది.వాషింగ్ మిషన్ లో కోటీ 30 లక్షలు హవాలా మనీని పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు పట్టుకున్నారు.విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఓ ఆటోని ఆపి తనిఖీలుచేశారు. డ్రైవర్ ను ప్రశ్నించగా విజయ వాడకు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కిరాయికి తీసుకెళుతున్నానని చెప్పాడు. కానీ పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా ప్యాక్ చేసిన ఉన్న వాషింగ్ మిషన్ లో కోటీ30 లక్షలు క్యాష్, 30 సెల్ ఫోన్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.ఆ నగదు ఎవరిది..? ఎవరు కిరాయికి మాట్లాడారు..? విజయవాడలో ఎక్కడికి డెలివరీ ఇవ్వటానికి తీసుకెళుతున్నావు..? అంటూ ఆటో డ్రైవర్ ను పోలీసులు ప్రశ్నించగా సరైన సమాధానలు చెప్పలేదు. దీంతో ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పాటు 30 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.