రాయచోటి:మానవ అక్రమ రవాణా మానవాళికి వ్యతిరేకమని ఇది చాలా ప్రమాదకరమని ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాల చైర్మన్ హరినాధ రెడ్డి, విఆర్డీఎస్ సురేంద్రరెడ్డి తెలిపారు.శనివారం మూమెంట్ ఇండియా, గ్రామ జ్యోతి సొసైటీ వారి సహకారంతో విఆర్డీఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్డీహెచ్ఆర్ డిగ్రీ కళాశాలలో వాక్ ఫర్ ఫ్రీడమ్ మానవ అక్రమ రవాణా అను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచ వ్యాప్తంగా జరిగే మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. దోపిడీ,బలవంతపు శ్రమ, బానిసత్వం, మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు,భిక్షాటన వంటి అనేక రూపాల్లో బాధితులు అక్రమ రవాణా చెయబడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు వ్యాపారం తర్వాత మానవ రవాణా అనేది అతి పెద్ద వ్యవస్థీకృత నేరం అన్నారు.అనంతరం కళాశాల విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా వాక్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రెడప్ప రెడ్డి, లెక్చరర్లు నాయుడు, మహమ్మద్, వెంకట రమణ, గుణశేఖర్ రెడ్డి, రెడ్డయ్య, రామంజులు, శివ సాయి క్రిష్ణ, జనార్థన్ రెడ్డి, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.