మదనపల్లి: GRT పాఠశాల నందు మదనపల్లి ఉప విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం గారు ఓపెన్ స్కూల్ గోడ పత్రాలను ఆవిష్కరించడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి మధ్యలో మానివేసిన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా తిరిగి విద్యను అభ్యసించడం ఒక వరం అన్నారు ఓపెన్ స్కూల్ ద్వారా 14 సంవత్సరాల వయసు పూర్తి అయిన వారు పదవ తరగతి నందు మరియు 15 సంవత్సరాల వయసు పూర్తయిన పదవ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్ నందు ప్రవేశం పొందవచ్చు అన్నారు ఓపెన్ స్కూల్ ద్వారా పొందిన సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యార్థులు పొందిన సర్టిఫికెట్ తో సమానమైన విలువను కలిగి ఉంటుందన్నారు దీనిద్వారా తదుపరి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు పూర్తి చేసుకోవచ్చన్నారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బడి మానివేసిన విద్యార్థులు మహిళలు చిరు వ్యాపారస్తులు తదితరులు తగిన విద్యార్హతలు పొందవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈనెల 28వ తారీకు వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశం పొందవచ్చు అన్నారు తదుపరి ఈనెల 29 మరియు 30 తేదీలలో ఆన్లైన్ ద్వారా 200 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రెటరీ మడితాడి నరసింహారెడ్డి, వెంకట్రామరాజు, ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్, భూపతి తదితరులు పాల్గొన్నారు