హైదరాబాద్‌ ఏప్రిల్‌ 3:బాధ్యతగల పౌరులుగా ఎన్నికలలో అక్రమాలు, ఉల్లంఘన పై ఫిర్యాదు చేయాలనుకుంటే సి విజిల్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్షన్‌ కమిషన్‌ రూపొందించిన సి `విజిల్‌ ను మొబైల్‌ లోయాప్‌ లో గూగుల్‌ పే స్టోర్‌ లో డౌన్లోడ్‌ చేసుకొని,మొబైల్‌ నందు నెంబర్‌ ద్వారా దానిలో రిజిస్టర్‌ చేసుకోవాలి తదుపరి ఓటిపి వస్తుందని దానిని నమోదు చేస్తే సి `విజిల్‌ యాప్‌ సిద్ధమైనట్లే అని, దాని ద్వారా విూరు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయొచ్చని ఎన్నికల అధికారి అన్నారు. ఎన్నికల నియమావళి కి భిన్నంగా ఉన్న దేనిపైన అయిన ఫిర్యాదు చేయొచ్చని సి` విజిల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా డబ్బు పంపకాలు, ఉచితాలు, ఓటర్లనుప్రలోభ పెట్టిన,మద్యం సరఫరా చేసిన,నేరపూరిత చర్యలతో భయభ్రాంతులకు గురిచేసిన, లెక్కకు మించిన ఖర్చు చేసిన, మతపరమైన ప్రసంగాలు చేసిన, ఫిర్యాదులు తాజాగా ఫోటోలు తీసి మరియు వీడియోలు, ఆడియో రికార్డ్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ఎక్కడైతే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించిన ఫోటో లేదా వీడియో తీసి యాప్‌ లో అప్లోడ్‌ చేయాలి. .100 నిమిషాల లోపే ఉల్లంఘన పై చర్యలు తీసుకుంటారు..సి`విజిల్‌ యాప్‌ లో అప్లోడ్‌ చేసిన ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాలలోపు జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలో గల మానిటరింగ్‌ సెల్‌ కు తెలుస్తుందని,తదుపరి ఐదు నిమిషాలలోపు క్షేత్ర పరిశీలన అధికారి అయిన ఎస్‌ ఎస్‌ టి, ఎఫ్‌.ఎస్‌. టి బృంపదం విచారణ నిమిత్తం పంపబడుతుంది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం 15 నిమిషాల్లో ఫిర్యాదులో తెలిపిన స్థలమునకు చేరుకొని క్షేత్ర విచారణ చేసి 30 నిమిషాలలో వివరాలు సేకరిస్తారు తమ నివేదికను సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి నివేదిస్తారు. దానిపై రిటర్నింగ్‌ అధికారి 50 నిమిషాల్లో నివేదికను పరిశీలించి ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కలెక్టరేట్‌ కార్యాలయంలో 24 గంటలు సి విజిల్‌ యాప్‌ ఫిర్యాదులపై పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్‌ నెంబర్లను, గోప్యంగా ఉంచడం జరుగుతుంది.సి`విజిల్‌ లో ఫిర్యాదు చేసే వ్యక్తులు పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేయాలని,తీరా ఆ ప్రదేశానికి చేరుకునే లోపు ఆధారాలు లేకుండా ఉండటం వలన సమయం వృధా చేయటం జరిగిందని, క్రితం లో ఇలాంటి పొరపాట్లు గమనించడం జరిగిందన్నారు. కావున ఆధారాలు పక్కా రుజువులతో ఉన్నప్పుడే ఫిర్యాదులు చేయాలని పేర్కొంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *