బాపట్ల జిల్లా యోగాసన ఛాంపియన్ షిప్2023 పోటీలు స్థానిక ఎకో హౌస్ నందు యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలోజరిగినవి. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కళ్ళం హరినాద్ రెడ్డి సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లాగా ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సంస్థ ద్వారా యోగాసన పోటీలు నిర్వహించడం సంతోషకరమైన విషయం అని అన్నారు. యువతీ యువకులు పెద్దలు యోగ సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ముఖ్యఅతిథిగా డాక్టర బి. శరత్ బోస్ మాట్లాడుతూ యోగ సాధన వలన శరీరానికి కావలసిన ప్రాణశక్తి, రక్త ప్రసరణ పుష్కలంగా అందుతుందన్నారు. గుండె, ఊపిరితిత్తులు, మెదడు కణాలు ఉత్తేజం పొంది ఆరోగ్యంగా ఉంటాయన్నారు.
సంస్థ జనరల్ సెక్రెటరీ అల్లాడి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటి వారు యోగ సాధన చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, యువత చదువులో రాణించి సక్రమ మార్గాన్ని ఎంచుకోవడానికి యోగ సాధన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలిక గురుకుల పాఠశాల పి ఈ టి. పి. శాంత కుమారి, మున్సిపల్ హైస్కూల్ పీఈటి. కత్తి శ్రీనివాసరావు, శ్రీ వేమన యోగ సాధన విద్యా మందిర్ యోగ సాధకులు పాల్గొని పోటీలలో చక్కని ప్రావీణ్యత ప్రదర్శించారు. అక్టోబర్ 14,15 తేదీలలో ఎంపికైన బాల బాలికలు భీమవరం నందు జరుగు రాష్ట్రస్థాయి యోగాసన పోటీలలో పాల్గొనేదరు. ఎంపికైన బాల బాలికలు : సబ్ జూనియర్ బాలికలు( 8-14 సంవత్సరాలు)ఏ. షర్మిల రాణి, జి. లాస్య, జె. అభిలాష, టీ. సాహితి, పి. శ్రీనిధి, సబ్ జూనియర్ బాలురు :కె.రోహిత్ జూనియర్ బాలికలు(14-18 సంవత్సరాలు)కె.శ్వేత,బి. ప్రవల్లిక, జి. మిథుల, టి. కీర్తన, బి. అంజలి