అన్నమయ్య జిల్లా : వైసిపి నియంత పాలనకు ఇక చరమగీతమే అని , రాయచోటి ఇంచార్జీ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్షలు 19 వ రోజు చేరుకున్నాయి . ఈ రోజున నియోజకవర్గం లోని అన్ని మండలాల నాయకులు,పెద్ద ఎత్తున రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భం గా రమేష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ నిత్యం కష్టపడే మనస్తత్వంతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి వైసిపి ప్రభుత్వం జైల్లో పెట్టి వేధిస్తుందన్నారు టిడిపి నాయకులను కట్టడి చేసి ఓటర్ల జాబితాలో టిడిపి ఓటర్లను తొలగించే కుట్రలో వైసిపి ఉందన్నారు నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధి మరచిన వైసిపి ప్రభుత్వం టిడిపి నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చాలా బాధాకరమన్నారు . చెడు వినొద్దు చూడొద్దు మాట్లాడొద్దు అన్న గాంధీజీ సూక్తిని పక్కనపెట్టి వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో మంచిని చూడొద్దు వినోద్దు ,మాట్లాడొద్దు అన్న అరాచక పాలన సాగిస్తుందన్నారు. రాబోయే 2024 ఎన్నికలలో ప్రజలు వైఎస్సార్ సీపీ పార్టీ కి తప్పకుండా గుణపాఠం ఓటు ద్వారా చెప్తారన్నారు … .ఈ కార్య క్రమం లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ M రమేష్ రెడ్డి , రామాపురం మండలాద్యక్షుడు రవి కుమార్ రెడ్డి ,క్లస్టర్ ఇంచార్జీ రామకృష్ణ గౌడ్ లక్ష్మి రెడ్డి ,కరుణాకర్ రెడ్డి సహదేవ రెడ్డి , వెంకట్రామరెడ్డి రెడ్డి ,జయరామిరెడ్డి ,కేశవ ,రవి రెడ్డి ,భగవాన్ రెడ్డి, సుభహన్ బాషా,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.