రాయచోటి:పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే భాద్యత ప్రతి ఒక్కరికీ ఉందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. స్వచ్ఛతా హి సేవా ఎక్ తారీక్- ఎక్ గంటా కార్యక్రమంలో భాగంగా రాయచోటి మున్సిపాలిటీలోని వీరభద్ర స్వామి ఆలయ సమీపంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల వీధిలో నిర్వహించిన చెత్త తొలగింపు, పరిసరాల పరిశుభ్రతలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ పోలంరెడ్డి విజయ, కౌన్సిలర్లు, నాయకులతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వీదిలోని చెత్తను తోసి,చెత్తను ఎత్తి ట్రాక్టర్ లో శ్రీకాంత్ రెడ్డి వేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రతలోపట్టణం ఆదర్శంగా నిలిచేలా సమిష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందన్నారు.చెత్తను రీ సైక్లింగ్ ద్వారా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నారన్నారు. పర్యావరణానికి హానికరంగా మారుతున్న ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలన్నారు.మున్సిపాలిటీ లో 25 ఈ ఆటోల ద్వారా చెత్తసేకరణ కార్యక్రమంలో చురుగ్గా సాగుతోందన్నారు. తెల్లారక ముందే చెత్తను తొలగించి ,డ్రైనేజీలును శుభ్రం చేస్తున్న పారిశుధ్యపు కార్మికులును గౌరవించాలన్నారు.ప్రభుత్వం వారికి 31 తేదీ రాత్రిలోగానే రూ 18 వేలు వేతనాలను అందిస్తోందన్నారు.స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గా అప్ గ్రేడ్ అయిన తరువాత అదనంగా అరవై మందిని పారిశుద్యపు కార్మికులను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్, కౌన్సిలర్లు ఆసీఫ్అలీ ఖాన్,సాదిక్ అలీ,కొలిమి ఛాన్ బాష,మదన మోహన్ రెడ్డిస్ గౌస్ ఖాన్,అల్తాఫ్, కసిరెడ్డి వెంకట నరసింహ రెడ్డి, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, ఫయాజ్ అహమ్మద్,రియాజ్, జయన్న నాయక్, భాస్కర్,జానం రవీంద్ర యాదవ్, గువ్వల బుజ్జిబాబు,రత్న శేఖర్ రెడ్డి, గంగిరెడ్డి, నాగేంద్ర, మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.